Main

ఆదివాసుల పేరుతో ద్రోహం చేయడం దారుణం

రేగా తీరుపై మండిపడ్డ స్థానిక నేతలు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  రాజకీయంగా ఎదిగి ఆదివాసుల అండతో ఎమ్మెల్యేగా ఎన్నికైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసులకే తీరని ద్రోహం చేశారని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు, టీపీసీసీ సభ్యులు ఎస్‌కె జానీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జీవీ భద్రం, మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి కటకం పద్మావతి విమర్శించారు. పార్టీ … వివరాలు

కేటీఆర్‌ రాకతో మారనున్న సీన్‌ 

పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ రెండు ఎంపీ సీట్లు గెలవడం కోసం దిశానిర్దేశం ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల విజయమే స్ఫూర్తిగా తీసుకొని అన్ని పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 6 నుంచి  రాష్ట్రంలో 16పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ¬దాలో కేటీఆర్‌ సవిూక్షలు … వివరాలు

కొత్త ఓటర్లలో చైతన్యం కోసం యత్నం

టీఆర్‌ఎస్‌ సమావేశాల్లో ప్రధానంగా దీనిపై దృష్టి భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొత్త ఓటర్ల నమోదులో ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న జిల్లాలో కొత్తగూడెం మినహా మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వై ఉన్నాయి. రిజర్వుడ్‌ స్థానంగా ఉన్న మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి గిరిజన … వివరాలు

కోల్డ్‌ స్టోరేజీలు పెరిగితే నే సమస్యకు పరిష్కారం 

ఖమ్మంపై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాలి ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి):  మిరప అధికంగా వచ్చే మార్కెట్‌ ఖమ్మం కావడంతో ఇక్కడికే మిర్చి రైతులు తమ పంటను తీసుకుని వస్తున్నారు. అయితే ఇక్కడ కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం వల్లనే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలను నిల్వ చేసుకునే సౌకర్యం ఉంటే పరిస్థితి మెరుగు కాగలదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని … వివరాలు

ఈ-నామ్‌కు మోకాలడ్డు

దగాపడుతున్న మిర్చి రైతులు ఖమ్మం,మార్చి4(జ‌నంసాక్షి): మూడేళ్లుగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ-నామ్‌ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు ఎక్కువగా ఉండడం.. ధర విషయంలో గత సంఘటనలు మార్కెట్‌లో పునరావృతం కాకుండా ఉండేందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అక్రమాలకు తావు … వివరాలు

ఉభయ జిల్లాల్లో జోరుగా డబుల్‌ ఇళ్లు

పూర్తి కావస్తున్న నిర్మాణాలు ఖమ్మం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం కెసిఆర్‌ ఆకాంక్ష మేరకు  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలుజోరుగా సాగుతున్నాయి.  ఈ క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణాలు ప్రారంభం కాగా, రెండవ దఫా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావడంతో … వివరాలు

విద్యార్థినిపై పాస్టర్‌ లైంగింక వేధింపులు

దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  జిల్లాలో ఓ విద్యార్థనిపై పాస్టర్‌ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థి అని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న విద్యార్థినిని పాస్టర్‌ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహం … వివరాలు

విద్యాభివృద్ది లక్ష్యంగా ప్రైవేట్‌ సంస్థలు పనిచేయాలి

ఖమ్మం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): సహృదయంతో విద్యార్థులకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలో పేతం చేసిందన్నారు. ప్రైవేటు విద్యా వ్యవస్థ అంటే … వివరాలు

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మహిళల మృతి ఖమ్మం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశ్రీ సర్కిల్‌ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకలకు వచ్చిన పెద్దపల్లికి చెందిన శ్రీలత, గోపాలపురానికి చెందిన కమల ఈ ప్రమాదంలో మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ అతి వేగంగా … వివరాలు

అక్రమంగా తరలిస్తున్నరేషన్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి129ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అక్రమ బియ్యం తరలింపుపై కన్నేసని పోలీసులు వాటిని స్వాధృనం చేసుకున్నారు.  జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.