ఖమ్మం

ప్రచారంలో కోలాహలం

ఇంటింటికీ తిరుగుతూ ఉమ్మడిగా ప్రచారం ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఖమ్మం,మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కడ చూసినా గులాబీ కోలాహలం కనబడుతుంది. గడిచిన కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలంతా గులాబీ దండులా అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల మెజార్టీ స్థాయిలో గెలుపే లక్ష్యంగా ప్రచారానికి పదును … వివరాలు

ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం 

కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి):  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ కూడలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆస్పత్రిలోని రోగులకు పండ్లు అందజేశారు. అనంతరం మండల ఉపాధ్యక్షుడు ఎం.రాజమోహన్‌రెడ్డి పేద ప్రజలకోసం ఎన్టీఆర్‌ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను … వివరాలు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం అన్న రేణుక ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌ విజయం సాధించి రాహుల్‌ ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని  ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరి వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతన్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ దూసుకుని పోతోందని అన్నారు. శుక్రవారం ఉదయం ఆమె పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వారితో … వివరాలు

జీడిమామిడి తోటలపై హక్కులు ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి): అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన పలువురు గిరిజనులు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న ప్రభుత్వ జీడిమామిడి తోటను వీఎస్‌ఎస్‌ సభ్యులకు తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. అటవీ అధికారులు తోటను వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని, కొంతనగదుకు తోటను అప్పగిస్తే జీడిగింజలు ఏరుకొని ఆదాయం సమకూర్చు కుంటామని వారు అంటున్నారు. ఈ మేరకు … వివరాలు

పొంగులేటి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు

– ఆయనతో నేను స్వయంగా మాట్లాడా – బుధవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారు – ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ పాలనసాగుతుంది – కేసీఆర్‌ పాలన నచ్చే తెరాసలో చేరా – ఖమ్మం పార్లమెంట్‌లో గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తా – ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం, మార్చి26(జ‌నంసాక్షి) : తెరాస … వివరాలు

పశువులపైకి దూసుకెళ్లిన లారీ: పలు పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి):  జిల్లాలోని ములకలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డుపై వెళ్తున్న పశువులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు పశువులు మృతి చెందాయి. మృతి చెందిన పశువుల వద్దకు వచ్చిన మిగతా పశువులు రోదిస్తున్నాయి. ఏం చేయాలో తోచక ఆ మూగ జీవాలు తల్లడిల్లుతున్నాయి. ఈ ఘటనతో పశువుల యజమాని తీవ్ర … వివరాలు

తెలంగాణ అభివృద్దికి పోరాడుతా

కెసిఆర్‌ సారథ్యంలో రాజకీయాల్లో మార్పులు: నామా ఖమ్మం,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌ పాలనను … వివరాలు

నామాను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: కొండబాల

ఖమ్మం,మార్చి26(జ‌నంసాక్షి): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 16 ఎంపీలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పడం తథ్యమని, అప్పుడే జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో నాయకులు, కార్యకర్తలకు సమప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. … వివరాలు

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నామినేషన్ల ఘట్టంతో తొలిదశ పూర్తి పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు పక్రియ పూర్తి కావడంతో తొలిదశ పూర్తయ్యిందన్నారు.  వచ్చే నెల 11వ … వివరాలు

మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు

భారీగా నిల్వలు రావడంతో అధికారుల అప్రమత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ సిబ్బంది ఖమ్మం,మార్చి19(జ‌నంసాక్షి):  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన సరుకును వచ్చినట్లుగానే కొనుగోలు చేసి పంపించే ఏర్పాట్లు చేశారు.  రోజుకు సుమారు 40వేల నుంచి 60వేల బస్తాలు వస్తుండటంతో నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించి … వివరాలు