నల్లగొండ

సాగర్‌ గేట్లు నేడు ఎత్తనున్న అధికారులు

నల్లగొండ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): నాగార్జున సాగర్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ మధుసూదన్‌ తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర్‌ ఇన్‌ప్లో 1,55,071 క్యూసెక్కులు కాగా, ఔట్‌ప్లో 44,097 క్యూసెక్కులుగా ఉంది. … వివరాలు

వర్షాలతో రైతులకు ఊరట

రైతుబందు,బీమా పథకాలతో భరోసా అందుకే ఉత్సాహంగా ప్రగతి నివేదన సభకు పయనం : గుత్తా నల్గొండ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఇటీవలి వర్షాల వల్ల రైతులకు ఊరట కలిగిందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వెల్లడించారు. మిషన్‌కాకతీయ పథకం వల్ల చెరువులన్నీ పటిష్ఠంగా తయారయ్యాయని వాటిల్లో ప్రస్తుతం వర్షాలవల్ల నీరు చేరుతోందని, రైతుల కళ్లల్లో సంతోషం చూస్తున్నట్లు … వివరాలు

కృష్ణమ్మ దూకుడు

– నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద – నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల – లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు నల్గొండ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : నాగార్జున సాగర్‌ జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద … వివరాలు

హరికృష్ణ భౌతిక కాయం వద్ద మంత్రి నివాళి

నల్లగొండ,ఆగస్టు29(జ‌నం సాక్షి): సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల తెలంగాణ విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు ప్రమాదానికి గురయ్యాడని వార్త తెలవగానే.. మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడికి హుటాహుటిన వెళ్లారు. అటునుంచి కామినేని ఆస్పత్రికి చేరుకొని.. హరికృష్ణ పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అప్పటికే … వివరాలు

రోడ్డు ప్రమాదంలో  నందమూరి హరికృష్ణ దుర్మరణం

– నార్కట్‌పల్లి వద్ద  బోల్తా కొట్టిన కారు – ప్రమాదంలో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలు – హుటాహుటీన కామినేని ఆస్పత్రికి తరలింపు – చికిత్స పొందుతూ కన్నుమూసిన హరికృష్ణ – శోకసంద్రంలో మునిగిపోయిన నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు – తండ్రి మరణంతో కన్నీరు మున్నీరైన జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రాం – దిగ్భాంతి వ్యక్తం … వివరాలు

గిరిజనులకు వరంగా మారిన కంటివెలుగు

నల్లగొండ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): గ్రామాల్లో వెలుగులు విరజిమ్ముతున్న కంటి వెలుగు కార్యక్రమం మండలంలో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తండాల్లో నిర్వహిస్తున్న శిబిరాలన్ని ఉపయోగించు కుంటున్నారు. పరీక్షలు చేయించుకున్నవారికి కళ్లద్దాలను అందజేస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే కోరారు. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజల … వివరాలు

మినరల్‌ ఆదాయంలో పాఠశాలలకు కేటాయింపులు

అధికారులకు మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూచన నల్గొండ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): జిల్లాలో మినరల్‌ ద్వారా వస్తున్న ఆదాయంలో 30 శాతం మొత్తం అభివృద్ధి పనులకు వినియోగించాలని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. అందులో మొదటి ప్రాధాన్యంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠాశాలలో మరుగు దొడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధ్యక్షతన మినరల్‌ ఫౌండేషన్‌ … వివరాలు

కలసి వచ్చిన తుఫాన్‌ వర్షాలు

నాలుగేళ్ల తరవాత సాగర్‌కు పూర్తిస్థాయిలో నీరు కళకళలాడుతున్న ప్రధాన జలాశయాలు నల్లగొండ/మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఇటీవలి తుఫాన్‌ వర్షాలు కలసి వచ్చాయి. గతకొన్నేళ్లుగా జలకళ తప్పిన ప్రధాన ప్రాజెక్టులు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. వాయుగుండాల కారణంగా కురిసిన వర్షౄలతో శ్రీశైలం,నాగార్జునసాగర్‌లకు భారీగా వరదనీరు చేరింది. ఈ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌లోని దాదాపు అన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. … వివరాలు

సాగర్‌కు పెరిగిన నీటిమట్టం

నల్లగొండ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): జిల్లావ్యాప్తంగా వర్ష కురవడంతో ప్రజలు ఇబ్బందికి లోనయ్యారు. అయితే సాగర్‌కు ఇన్‌ఫ్లో వల్ల భారీగా వరదనీరు చేరుతోంది. జిల్లా కేంద్రంలో ఉదయం ముసురుతో ప్రారంభమై సాయంత్రానికి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు జలమయం కాగా వరద పొటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురవగా … వివరాలు

భూ వివాదంలో మహిళ హత్య

నల్లగొండ,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెంలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన వీరమళ్లు లక్ష్మమ్మ(65) దారుణ హత్యకు గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దొండవారిగూడెంలో పోలీసులు భారీగా మోహరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా … వివరాలు