నిజామాబాద్

కామారెడ్డి ఆస్పత్రిస్థాయి పెంచాలి

పెరుగుతున్న రోగులతో సౌకర్యాల కొరత కామారెడ్డి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): కామారెడ్డి ఆస్పత్రి స్థాయి పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారిస్తే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.  నిత్యం 700 మంది ఓపీ పరీక్షలకు వస్తుంటారు. 50-75 మంది చికిత్స పొందుతుంటారు. మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. తాగునీటి కొరత ఉంది. శవ … వివరాలు

ఆర్మూర్‌లో రైతుల ఆందోళన

– పసుపుకు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ నిజామాబాద్‌, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : పసుపు, ఎర్రజొన్న పంటల ఉత్పత్తులకు మద్దతు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా రైతులు గురువారం రోడ్డెక్కారు. ఆర్మూర్‌ నియోజకవర్గం మామిడిపల్లి కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. పసుపు క్వింటాకు రూ.15వేలు, ఎర్రజొన్న క్వింటాకు రూ.3,500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి … వివరాలు

స్పీకర్‌ పోచారంను పరామర్శించిన కేసీఆర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : బాన్సువాడ మండలం పోచారంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. కాగా గురువారం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బాన్సువాడ చేరుకుని అక్కడున్నంచి … వివరాలు

ఉపాధిలో అదనపు పనులకోసం ప్రణాళిక

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం నిజామాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఉపాధి హావిూ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించి వారి ఉపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. గ్రామ పంచాయతీల్లో ఉపాధి కూలీలకు అదనపు పని దినాలను కల్పించాలని డీఆర్డీవో అధికారులు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ మేరకు గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ఏ మేరకు … వివరాలు

బాలకార్మికులను పెట్టుకుంటే చర్యలు

కామారెడ్డి,పిబ్రవరి2(జ‌నంసాక్షి): బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కార్‌ఇమక శాఖ అధికారులు హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా ఆయా కేంద్రాల యజమానులు బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవన్నారు. జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా ఉందన్నారు.జిల్లాలో బాలకార్మికులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. బాలకార్మిక చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దన్నారు. విద్యాహక్కును … వివరాలు

వార్‌ వన్‌ సైడే

– 16పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌వే – ప్రియాంక వచ్చినా దేశానికి ఒరిగేదేవిూ ఉండదు – సెక్రటేరియట్‌కై డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు – పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం – తెరాస ఎంపీ కవిత నిజామాబాద్‌, జనవరి30(జ‌నంసాక్షి) : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడేనని, 16 పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్సే … వివరాలు

అక్రమంగా కలప కలిగివుంటే చర్యలు

కామారెడ్డి,జనవరి30(జ‌నంసాక్షి): అడవులను నరికివేస్తే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని కామారెడ్డి డీఎఫ్‌ఓ వసంత హెచ్చరించారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చెట్లను నరికివేయద్దవని సూచించారు. అడవులను నరికితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని అన్నారు.స్మగ్లర్లు కలప కోసం అడవులను నరికితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా కలప అక్రమ … వివరాలు

చలిగాలులతో ఆరోగ్యం జాగ్రత్త

వైద్యుల హెచ్చరిక నిజామాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈదురు గాలులు, చలి ప్రభావం పంటలపై సైతం ఉంటుందని, దిగుబడులు తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈదురు గాలులు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో చలి గాలుల ప్రభావం … వివరాలు

చురుకుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

రంగంలోకి దిగిన ఆశావహులు వివరాలు తెలుసుకుని నమోదు చేయిస్తున్న నేతలు నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఆయా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు పక్రియ ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ ఆశావహులు జోరుగా నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న మరికొన్ని ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు త్వరలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు … వివరాలు

ఇంటిదొంగలపై కన్నేసిన అధికారులు

ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): కలప స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల వ్యవహారంపై అటవీ,పోలీస్‌ శాఖలు దృష్టి సారించాయి. కటిన చర్యలకు ఉపక్రమించాయి. అంతర్గత సమావేశాలతో హెచ్చరికులచేస్తున్నారు. అక్రమాలు మెల్లగా వెలుగులోకి వస్తున్న క్రమంలో పోలీసు, అటవీశాఖల ఉన్నతాధికారులు తమ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించమని, వాటి జోలికి వెళితే ముఖాలు చూసే … వివరాలు