మెదక్

పంచాక్షరితో మార్మోగిన యాగశాల

నాలుగోరోజూ వేదోక్తంగా పారాయణాలు శ్రీ రాజశ్యామలాదేవికి సువర్ణమంత్ర పుష్పాంజలి పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు..నేడు పూర్ణాహుతితో ముగింపు గజ్వెల్‌,జనవరి24(జ‌నంసాక్షి): పంచాక్షరి జపంతో సిఎం కెసిఆర్‌కు చెందిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని యాగశాల మార్మోగింది. దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సహస్ర చండీయాగం నాలుగో రోజూ కొనసాగుతోంది. కార్యక్రమంలో యాగకర్త, … వివరాలు

ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మొదట రాజశ్యామల దేవీ కొలువు దీరిన మండపానికి … వివరాలు

కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు

నవవధువు ఆత్మహత్య యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి అయిన నెల రోజుల నుండే అదనపు కట్నం కోసం భర్త వేధింపులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే కళ్యాణలక్ష్మి డబ్బులు తనకే ఇవ్వాలని భర్త విక్రమ్‌ బాండ్‌ రాయించుకున్నాడు. … వివరాలు

పక్కాగా ఎన్నికల లెక్కలు అప్పగించాలి

మెదక్‌,జనవరి19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా అధికారులు అన్నారు.ప్రతి సర్పంచ్‌ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియామవళిని తప్పకుండా పాటించి ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు. స్థానిక … వివరాలు

గజ్వెల్‌లో ఇక తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌

వంటేరు చేరికతో మారనున్న సవిూకరణాలు ఉనికి కోల్పోయిన విపక్ష పార్టీలు గజ్వేల్‌,జనవరి19(జ‌నంసాక్షి): గజ్వేల్‌ సీనియర్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్‌ ఖాళీ అయినట్లే. దీనికితోడు నియోజకవర్గంలో ఇక అంతా అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడి టిఆర్‌ఎస్‌కు ఎదురులేకుండా పోయింది. విపక్షపార్టీ అన్నది కనుమరుగు … వివరాలు

కొలిక్కి వస్తున్న మల్లన్నసాగర్‌ వ్యవహారం

మనసు మార్చుకుని భూములు ఇస్తున్న రైతులు సిద్దిపేట,జనవరి18(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఇప్టపి వరకు మొండికేసిన రైతులు తమ మనసు మార్చుకుని భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మొదటి నుంచీ ఈ రిజర్వాయర్‌కు భూములను ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్న రైతులు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ … వివరాలు

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ఇద్దరు యువకుల మృతి మెదక్‌,జనవరి14(జ‌నంసాక్షి): మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకుంది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మనోహరాబాద్‌కు చెందిన రంజిత్‌ (20), విష్ణు (21)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స … వివరాలు

చేవెళ్ల పార్లమెంటు బిజెపి కైవసం

భాజాపాచేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి తాండూరు జనవరి 13(జనం సాక్షి)  చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చేవెల్ల పార్లమెంటరీ ఇంచార్జి జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పటేల్ రవి శంకర్, నాగారం నర్సింలు, … వివరాలు

మాజీ మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక

 తాండూరు జనవరి13( జనం సాక్షి)  ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో  పెద్దేముల్ గ్రామ పంచాయతీ అనుబంధ తాండ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ వార్డ్ మెంబర్స్ చందర్ తో పాటు తాండ వాసులు పెద్దేముల్ గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ గుడాల బలమణీ … వివరాలు

పంచాయితీల ఏకగ్రావాలకు పాటుపడాలి

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని చాటాలి సిద్దిపేట,జనవరి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన మాదిరే అదే స్పూర్తి, పట్టుదలతో కార్యకర్తలు పని చేసి గ్రామ పంచాయతీపై గులాబీ జెండా ఎగురవేద్దామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ఆదరించిన ప్రజలు పంచాయితీ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలన్నారు. అన్ని … వివరాలు