నిజామాబాద్

వేసవిలో ఉపాధి పనులు పెంచాలి

మరిన్ని పనుల కోసం కూలీల డిమాండ్‌ నిజామాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): ఈ వేసవిలో ఉపాధి పనులు పెంచాలని చూస్తున్నందున గ్రామాల్లో వివిధ పనులను వీరికి అప్పగించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. వేసవిలో చెరువుల పూడికతీత మొదలు, కాలువగట్టు పనులు తదితర పనులు కల్పిస్తే మంచిదని అంటున్నారు. గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ పనుల్లో, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనుల్లో … వివరాలు

టెన్త్‌ పరీక్షలకు సన్నాహాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఉత్తీర్ణత పెంచేందుకు కృషి కామారెడ్డి,మార్చి1(జ‌నంసాక్షి): మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా వెనుకబాటులోనే ఉంది. ఈసారి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా మొదట్నుంచి యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. గతేడాది కేవలం … వివరాలు

80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం  

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందని  డీఆర్డీఏ పీడీ తెలిపారు. ప్రతీ గ్రామంలో పూర్తయిన మరుగుదొడ్ల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఆన్‌లైన్‌లో పొందపర్చడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉపాధి పనుల కల్పన, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు … వివరాలు

అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ):  వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం  సందర్భంగా ఆయన పరిస్థితిని సవిూక్షించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడడాలని, అలాగే అవసరాలకు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. బోధన్‌ మండలం పెగడాపల్లి ప్రభుత్వ క్వారీ, మెండోరా మండలం పొతంగల్‌లోని … వివరాలు

టెన్త్‌ పరీక్షలకు నిముషం నిబంధన

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 44 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి.  ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మొత్తం 38 వేల 561 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది … వివరాలు

23న మరోమారు రైతుల ఆందోళన

ఎర్రజొన్న,పసుపు పంటలకు గిట్టుబాటు ధరలకు డిమాండ్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్ధతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలంగాణ రైతుసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నేతలు ఆరోపించారు. గ్రామాలలో 144 సెక్షన్‌ విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 23వ తేదీన జిల్లా, … వివరాలు

వ్యవసాయంలో సేంద్రియ బాట పట్టండి

రైతులకు శాస్త్రవేత్తల సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలని వ్యవసాయవేత్తలు సూచించారు. డిమాండ్‌ ఉన్న పంటలను కేవలం సేంద్రియ పద్దతుల్లో పండించడం అలవాటు చేసుకోవాలని అన్నారు.  దుకాణాదారుల మోసపూరిత మాటలు నమ్మకూడదని, సారవంతమైన భూములను కాపాడుకోవాలని సూచించారు.  వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని … వివరాలు

అధిక ఫీజులను నియంత్రించాలి

నిజామాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని జిల్లా అధికారులకు పేరెంట్స్‌ విన్నవిస్తున్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే అప్పుడే కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు మొదలయ్యాయి.  ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు కూడా అంటున్నారు. వార్షిక పరీక్షలు సవిూపిస్తున్న నేపథ్యంలో ఫీజులు కట్టడం లేదని విద్యార్థులను … వివరాలు

కొనసాగనున్న 22వ ప్యాకేజీ 

కామారెడ్డి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రాణహిత చేవెల్లలో భాగంగా ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన తొలగింది. ప్రాణహిత,చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని యథావిధిగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని  తెలిపారు.  కామారెడ్డి ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి … వివరాలు

హెల్త్‌ సర్వేను ఉపయోగించుకోవాలి

వందరోజుల ప్రణాళికతో ఏప్రిల్‌ మాసాంతానికి పూర్తి నిజామాబాద్‌,ఫిబ్రవరి15(ఆర్‌ఎన్‌ఎ): వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పలు వ్యాధులతో దవాఖానల చుట్టూ తిరుగుతున్న వారికి భరోసా కల్పించేలావ్యాధులపై సర్వే చేయనున్నారు. ఈ పక్రియను రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఈ వేసవిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రోగ … వివరాలు