హైదరాబాద్

అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు..  నెలకు రూ.3వేల భృతి

– రాష్ట్రంలో 25లక్షల ఓట్లను తొలగించారు – వారందరినీ చేర్చిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి – అమరవీరుల ఆత్మ ఘోషించేలా కేసీఆర్‌ పాలన – కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు – టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) :  తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీతో పొత్తు … వివరాలు

100 స్థానాల్లో తెరాసదే గెలుపు

– అమిత్‌ షా తెలంగాణలో షో చేస్తున్నారు – కాంగ్రెస్‌ నేతలు దేశద్రోహులు – ఆపద్దర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి – తెరాస భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన నాయిని హైదరాబాద్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెరాసకే అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 100 స్థానాల్లో తెరాస జెండా ఎగరడం … వివరాలు

‘టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రజాకార్ల సమితి’

– అబద్దాలు చెబుతూ బతికే పార్టీ టీఆర్‌ఎస్‌ – భాజపా అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం – భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ – భాజపా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విమోచన దినం – పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ … వివరాలు

టీఆర్ఎస్‌ కు పరాభవం తప్పదు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – గాంధీభవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం టీఆర్ఎస్‌ కు, కేసీఆర్‌కు ఇష్టం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా … వివరాలు

గెలుపు లక్ష్యంగా పనిచేయాలి: బివి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఐక్యంగా పని చేయాలని జనగామ జిల్లా కార్యకర్తలతో ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ ముఖ్యనాయకులు కొందరు ఆయనను కలసినప్పుడు పార్టీ గెలుపుపై సూచనలు చేవారు. సీఎం కేసీఆర్‌ అదేశాలమెరకు ఈనెల 25లోపు యువ ఒటర్లను నమోదుచేయించాలని కోరారు. అదేవిధంగా ఓటర్లజాబితాలో తప్పు ఒప్పులను సరిదిద్దాలని దీనిలో గ్రామాల్లోని … వివరాలు

కెసిఆర్‌కు గుణపాఠం తప్పదు

విమోచనను విస్మరించడంపై నల్లు హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రజలకు ఇచ్చిన హావిూని మరచారని అన్నారు. కేవలం ఎంఐఎంకు తలొగ్గి చరిత్రను అవమానించడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎంఐఎంకు … వివరాలు

రాజకీయాల చుట్టూ తెలంగాణ విలీనం

  అధికారికంగా నిర్వహించడంలో పాలకుల వైఫల్యం హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిజాం రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్‌ సైన్యాలు 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్‌ చేరుకోవడం, రక్తపు బొట్టు చిందకుండా 17న విలీనం చేస్తున్నట్లు నవాబు ప్రకటించడంతో ఆనాడు హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం అయ్యింది. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో ఆనాడు … వివరాలు

జవహర్ నగర్ లో బీసీల ఆత్మ గౌరవం – రాజ్యాధికారం సదస్సు

బీసీ లకు రాజ్యాధికారం లేకనే అన్ని రంగాల్లో వెనుకంజ బీసీ సదస్సులో పలువురు వక్తల ఉద్ఘాటన మేడ్చల్ జిల్లా / జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (జనం సాక్షి): మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ శ్రీ మహంకాళి గుడి ఆవరణం లో  బీసీ ల ఆత్మ గౌరవం – రాజ్యాధికారం అనే అంశం పై జవహర్ … వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వీ పరీక్షకు 78.46 శాతం హాజరు

హైదరాబాద్: వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వీఆర్వో పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 78.46 శాతం హాజరయ్యారని టీఎస్పీఎస్సీ తెలిపింది. 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 627 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

రాష్ర్టానికి వర్షసూచన

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఈనెల 18వతేదీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా… దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.