Featured News

దేశాన్ని కాపాడాలనుకుంటే..  బీజేపీకి ఓటు వేయకండి

– టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఐదేళ్ల పాలనలో మోదీ దేశాన్ని విభజించి పాలించారని, రాష్ట్రాలను కేంద్రం చెప్పుచేతల్లోకి తీసుకొనేలా ప్రయత్నించారని పశ్చిమ బెంగాళ్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని కాపాడాలనుకుంటే బీజేపీకి ఓటే వేయవద్దని ఆమె పిలుపునిచ్చారు. కృష్ణానగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో … వివరాలు

మళ్లీ ధర్మమే గెలుస్తుంది

– ఏపీని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్నదే నాలక్ష్యం – తనకు విసెస్స్‌ చెప్పిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు – ట్విట్టర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : మళ్లీ ధర్మమే గెలుస్తుందని, తెదేపా గెలుపుకోసమే మహిళలు రాత్రివేళల్లోనూ క్యూ లైన్‌లలోనిలబడి ఓట్లు వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం  చంద్రబాబు … వివరాలు

శిశువు మృతదేహాన్ని..  పీక్కుతిన్న వీధికుక్కలు!

– శంషాబాద్‌లో ఘటన హైదరాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ శంషాబాద్‌ లో దారుణం జరిగింది. ప్రాణాలు కోల్పోయి పుట్టిన ఓ ఆడశిశువును వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. చనిపోయిన శిశువును ఆసుపత్రి వెనక తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. వీధికుక్కులు మృతదేహాన్ని బయటకు లాగి పీక్కుతిన్నాయి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన రజినీ సుమన్‌, సునీతా కుమారి దంపతులు … వివరాలు

సాధ్వి ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు

– హేమంత్‌ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధ్వి – 24గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం భోపాల్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : 2008 సెప్టెంబరు 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్‌ అధికారి హేమంత్‌ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం … వివరాలు

మోదీ ఓ ఫూల్‌!

– కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బెంగళూరు, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. లక్షిత దాడులు (సర్జికల్‌ స్టైక్స్‌) చేసిన ఘనత తనదేనని మోదీ చెప్పుకోవడంపై ఘాటుగా విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  సర్జికల్‌ స్టైక్స్‌ ఘనత తనదేనని చెప్పుకుంటున్న మోదీ ఓ … వివరాలు

బయటపడుతున్న..  ఇంటర్‌ బోర్డు నిర్వాహకం

– బోర్డు తప్పిదాలతో ఆందోళనకు దిగుతున్న విద్యార్థులు – 500మంది విద్యార్థులకు లభించని ప్రాక్టికల్‌ మార్కులు – ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన – బోర్డు కార్యదర్శి అశోక్‌ను గెరావ్‌ – ఇంటర్‌ బోర్డులో ఎలాంటి తప్పిదాలు జరగలేదు – రీకౌంటింగ్‌కు వెళ్లండంటూ బోర్డు కార్యదర్శి దురుసు వ్యాఖ్యలు హైదరాబాద్‌,  ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) … వివరాలు

పాక్‌పై దాడిచేసే దైర్యంగల ప్రధాని కావాలి

– మోదీకి అలాంటి లక్షణాలున్నాయి – అందుకే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం – శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే ఔరంగాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : పాక్‌లాంటి శత్రుదేశాలపై దాడి చేయగలిగే ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి కావాలని, ఆ లక్షణాలు మోదీలో ఉన్నాయని, దీంతోనే భాజపాతో పొత్తు కుదుర్చుకున్నామని శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. … వివరాలు

రాహుల్‌ నామినేషన్‌ పేపర్ల పరిశీలన వాయిదా

– పరిశీలన ఏప్రిల్‌ 22 వరకు వాయిదా అమేథి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గంతోపాటు కేరళలోని వాయనాడ్‌ నుంచి కూడా బరిలో దిగుతున్నారు. అయితే, అమేథీలో సమర్పించిన నామినేషన్‌ పట్ల ఇండిపెండెంట్‌ అభ్యర్థి ధ్రువ్‌ లాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ సమర్పించిన నామినేషన్‌ పట్ల … వివరాలు

ఐదేళ్ల పాలనలో..  దేశాన్ని ముక్కలు చేశారు

– ప్రతి రాష్ట్రం.. దేశంలో భాగమేనన్న సత్యాన్ని మోదీ మర్చారు – ఇచ్చిన హావిూల పరిష్కారంలో విఫలమయ్యారు – పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం – అధికారంలోకి రాగానే ప్రతివర్గానికి న్యాయం చేస్తాం – ఎన్నికల ప్రచారంలో ప్రియాంక వాద్రా వయనాడ్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : దేశంలోని ప్రాంతాలన్నీ ఒకటేఅన్న సూత్రాన్ని మరిచి … వివరాలు

ఏడు స్థానాల్లో పోటీచేసి.. ప్రధాని పదవిపై కోరికనా?

– దేవెగౌడపై విమర్శలు గుప్పించిన భాజపా నేత యడ్యూరప్ప బెంగళూరు, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : అద్వానీలా తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాబోనని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తిప్పికొట్టారు. దేవెగౌడ ప్రధాని కావాలని ఆశపడుతున్నారని ఆయన విమర్శించారు. ఓ జాతీయ విూడియాకిచ్చిన ఇంటర్వ్యూలో యడ్యూరప్ప మాట్లాడుతూ.. కర్ణాటకలో … వివరాలు