*అంగన్ వాడిలో శ్రీమంతాలు*

*పలిమెల, జూన్ 24 (జనంసాక్షి)* సెంటర్ పరిదిలోని గర్భిణి మహిళలకు శ్రీమంతాలు జరిపారు అంగన్ వాడి నిర్వాహకులు. మండలంలోని సర్వాయిపేట-1 అంగన్ వాడీ కేంద్రంలో గర్భిణి మహిళకు శ్రీమంతం జరిపారు. అంగన్ వాడీ టీచర్ ఏలేంద్ర ఆధ్వర్యంలో గర్భిణీ మహిళకు అంగన్ వాడి కేంద్రంలో శ్రీమంతం కార్యక్రమం స్థానిక మహిళల సమక్షంలో జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.