అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూరులో చేపట్టిన పోడు భూముల
పట్టాలు ఇవ్వాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల, ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా పిడిఎస్‌యూ ఆర్మూర్‌ ఏరియా అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ఇ జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు. ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌ నియంత పాలన కొనసాగుతోందని కల్వకుంట్ల రాజ్యంలో రైతులు, ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, విసుగెత్తి పోయారని, కెసిఆర్‌ చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను సహించబోమని అక్రమ కేసులు అరెస్టులు ఎన్ని చేసిన రైతులకు అండగా
మేమేప్పుడు నిలబడతామని, మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా రైతుల విషయం ఆలోచించి పోడు భూమి పట్టాలు ఇవ్వాలని, రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నిరుద్యోగులు పట్ల కేసీఆర్‌ మొండి వైఖరిని మానుకొని ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని లేనిపక్షంలో ఈనెల 24వ తారీఖున ప్రగతి భవన్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారుల అక్రమ అరెస్టులను విద్యార్థులు మేధావులు కార్మికులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఖండిరచాలని కోరుతున్నామని ఆయన అన్నారు.