అటానమస్‌ డిగ్రీ కళాశాలలో క్లస్టర్‌ విధానం

విద్యార్థులకు మంచి అవకాశమన్న  నవీన్‌ మిట్టల్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :తెలంగాణలో రానున్న విద్యా సంవత్సరం నుంచి 9 అటానమస్‌ డిగ్రీ కాలేజీల్లో క్లస్టర్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకు వస్తామని విద్‌ఆయశృాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. క్లస్టర్‌ విధానాన్ని అమలులోకి తీసుకు రావడం ద్వారా ఆర్ట్స్‌ గ్రూపుల్లో చదివే విద్యార్థులు సైన్స్‌ స్జబెక్టులు చదివే అవకాశం ఉంటుందన్నారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటుచేసిన తెలంగాణ ఫ్యూచర్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ `2021 ని కవిూషనర్‌ ఆఫ్‌ కాలేజికేట్‌ ఎడ్యుకేషన్‌ తెలంగాణ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ఈ విధానం విద్యార్థులకు, విద్యా సంస్థలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఓ కాలేజీలో చదివే విద్యార్థి రెండవ కాలేజీలో తనకిష్టమైన కోర్సును చదివే సౌలభ్యం ఈ విధానం ద్వారా ఉంటుందని ఆయన వివరించారు. దేశంలోనే విద్యారంగం అభివృద్ధిలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచిందని నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. తెలంగాణ జి ఈ ఆర్‌ ఆర్‌ దేశ సగటు జి ఆర్‌ కన్నా 10 శాతం ఎక్కువ అన్నారు. డిగ్రీ విద్యార్థులకు దోస్త్‌ అప్లికేషన్‌ ద్వారా ఆª`లనైన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో విద్యార్థులకు, విద్యా సంస్థలకు కలిసి వచ్చిందన్నారు. తెలంగాణ అమలుపరిచిన ఆª`లనైన్‌ కౌన్సిలింగ్‌ విధానాన్ని ఇతర రాష్టాల్రు అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మెంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎక్స్‌ పోర్ట్‌ కమిటీ సదరన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి బి కె రావు మాట్లాడుతూ తూ జిల్లా వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు కాలేజీలను క్లస్టర్లుగా రూపొందించి అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. అనంతరం నిర్వహించిన ప్యానెల్‌ డిస్కషన్స్‌ లో ఉస్మానియా వి.సి ప్రొఫెసర్‌ డి రవీందర్‌. ఐఐటి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి ఎస్‌ మూర్తి. ఎస్‌ టి పి ఎల్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ జే ఏ చౌదరి. ఐసీసీ రీజినల్‌ హెడ్‌ నవీన్‌ మాడిశెట్టి. ఐ ఎస్‌ బి అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ చందన్‌ చౌదరి. స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ అకాడవిూ సీఈవో ఎన్‌ శ్రీకాంత్‌ సింహా. వెంకటేశ్వర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కాలేజ్‌ డైరెక్టర్‌ అనిత మారం రాజు తదితరులు ఈ సదస్సు లో రస్తుత తరుణంలో విద్య విధానంలో తీసుకు రావాల్సిన మార్పులు ఎదుర్కొంటున్న సమస్యలు అనే అంశంపై ప్యానెల్‌ డిస్కషన్స్‌ నిర్వహించారు.