అభివృద్దిలో ఎప్పుడూ ముందడుగే

పలు కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం
సూర్యాపేట,నవంబర్‌6 (జనంసాక్షి):   అభివృదద్‌ఇ విషయంలో తమప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని
రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. సంక్షోభంలోనూ అభివృద్ది, సంక్షేమం ఆగలేదన్నారు. సూర్యాపేట శాసన సభ్యులుగా 2014లో సూర్యాపేటలో మొదలు పెట్టిన అభివృద్ధి యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణాన్ని సుందర నగరంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి జగదీష్‌ రెడ్డి తన లక్ష్య సాధనలో మరో అడుగు వేశారు. ఇందులో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు 2 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మూడు పార్కులు, సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 9వ వార్డ్‌ అంబేద్కర్‌ నగర్‌లో రూ.14 లక్షలు, 27వ వార్డ్‌ పరిధిలోని ఆర్‌. కె గాª`డ్గంªన్స్‌ వద్ద రూ.40 లక్షలు ,13వ వార్డ్‌ అంజనపురి కాలనీలో రూ.45 లక్షల అంచనాలతో సి.సి రహదారులతో పాటు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సద్దుల చెరువు సవిూపంలో రూ.50 లక్షలు, 8 వార్డ్‌ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో రూ.50 లక్షలు, కృష్ణా టాకీస్‌, ముత్యాలమ్మ గుడి వెనుక భాగంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన పార్కుల నిర్మాణాలకు మంత్రి జగదీష్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.