ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జాయింట్ కలెక్టర్

ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ చాహత్ బాజ్పాయి,ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ చాహత్ బాజ్పాయి,పలు పాఠశాలల విజిట్, విద్యార్థులకు విద్యాబోధన,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:(జనం సాక్షి)2 డిసెంబర్ కాగజ్ నగర్ గ్రామీణం:చింతలమానెపల్లి మండలంలోని పలు పాఠశాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ చాహత్ భాజ్ పేయ్  శుక్రవారం ఆకస్మికంగా పర్యటన చేపట్టారు, మండల కేంద్రంలోని డబ్బా, దుబ్బగూడ ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థుల  సామర్త్యాలను అడిగి  తెలుసుకున్నారు. పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలను ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖమర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చింతలమానేపల్లి క్రీడాప్రాంగణాన్ని పరిశీలించి పలు విడి విడి గా  మొక్కలు నాటాలని సూచించారు అనంతరం గూడెం గ్రామంలో  ప్రభుత్వ పాఠశాల, మరియు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు,విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. క్రీడా ప్రాంగాణం, నర్సరీలను పరిశీలించారు. గూడెం జీపీ ట్రాక్టర్ లో కట్టెలు ఉండడాన్ని గమనించిన కలెక్టర్ స్వంత పనులకు వాడుకుంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీఓను అదేశించారు. అనంతరం కేతిని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు భోధించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్య క్రమంలో  ఎంపీడీఓ మహేందర్, ఏపీఓ గోవర్ధన్, జూ.అసిస్టెంట్ పెంటు, ఆయా పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు,