ఆర్థిక చక్రబంధనంలో అఫ్ఘాన్‌


ఆ దేశంలో సాయం నిలిపివేసిన ప్రపంచబ్యాంక్‌
ఇప్పటికే ఆర్థఙక సాయం నిలిపేసిన అమెరికా
అక్కడ ఇక ప్రాజెక్టులు కొనసాగడం కష్టమే
న్యూయార్క్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్‌ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అక్కడ చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. తాలిబన్లు అధికారంలోకి వస్తే.. ఆ దేశ అభివృద్ధి భవిష్యత్తుపై, మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి
ఐఎంఎఫ్‌ అప్గాన్‌కు చెల్లింపులు నిలిపివేసిన కొన్ని రోజుల్లో ప్రపంచ బ్యాంకు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇది అప్గానిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ. అప్గానిస్థాన్‌లో మా ప్రాజెక్టులకు చెల్లింపులను నిలివేశాం. పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఇన్నేళ్లు కష్టపడి సాధించిన అభివృద్ధిని కాపాడుకొనేందుకు అక్కడ కొనసాగే విషయంపై మా భాగస్వాములతో కలిసి సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నాం. అయితే అక్కడి ప్రజలకు మా మద్దతు కొనసాగుతుందని ప్రపంచబ్యాంకు ప్రతినిధి పేర్కొన్నారు. 2002 నుంచి ప్రపంచ బ్యాంకు ఇక్కడ 5.3 బిలియన్‌ డాలర్లను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఈ మొత్తంతో అప్గాన్‌ పునర్‌ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. కానీ, తాలిబన్ల ఆక్రమణ తర్వాత పనులు నిలిచి పోయాయి. దీంతో తమ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ప్రపంచబ్యాంకు పాకిస్థాన్‌కు తరలించింది. ఆ దేశంలోని పరిస్థితిపై ముఖ్యంగా మహిళల హక్కులపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని ఈ బ్యాంకు అధికారి తెలిపారు. ఆఫ్ఘన్‌ దేశానికి ఇక సాయం చెయ్యబొం..అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం అని ఆయన చెప్పారు. పైగా అంతర్జాతీయ దేశాలతోనూ, భాగస్వాములతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని..ఆఫ్ఘన్‌ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఆఫ్ఘన్‌ అభివృద్ధికి వరల్డ్‌ బ్యాంకు రెండు డజన్ల ప్రాజెక్టులను చేపట్టింది. 2002 నుంచి 5.3 బిలియన్‌ డాలర్లను ఈ దేశ ప్రగతికి వ్యయం చేసింది. ఈ నిధుల్లో చాలావరకు గ్రాంట్ల రూపంలో లభించింది. గత శుక్రవారం నాటికే కాబూల్‌ లోని తమ సిబ్బందినంతటినీ వరల్డ్‌ బ్యాంకు తరలించింది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా ఆఫ్ఘనిస్తాన్‌ దేశానికి తన నిధులను ఆపివేసినట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ సాయంలో 370 మిలియన్‌ డాలర్ల రుణ కార్యక్రమం కూడా ఉందని, ఇదిగాక.. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ కింద సోమవారానికి మరో 340 మిలియన్‌ డాలర్ల సాయాన్ని కూడా నిలిపివేశామని పేర్కొన్నాయి. అమెరికా గతవారమే ఆఫ్ఘన్‌ సెంట్రల్‌ బ్యాంకులోని 9.4 బిలియన్‌ డాలర్ల నిధులను స్తంభింప జేసింది. పేద దేశమైన ఆఫ్ఘానిస్తాన్‌ గత 20 ఏళ్లుగా నిధులకోసం ఇలా అమెరికా, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలపైనే ఆధారపడుతూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఇండియా కూడా అక్కడి ప్రాజెక్టులకు సహాయపడిరది. భారత ప్రభుత్వం అందజేసిన నిధులతోనే కాబూల్‌ లో పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించారు. దీన్ని గత ఏడాది ఆఫ్ఘన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని ప్రారంభించిన సంగతి తెలిసిందే.