ఉక్రెయిన్‌ వదిలి రష్యా సైనికులు పారిపోండి

లేదంటే ప్రాణాలు దక్కవు
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు హెచ్చరిక
కీవ్‌  సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి):
ఉక్రెయిన్‌ ఖర్కివ్‌ (ఐష్ట్రజీతీసతిల)లోని రెండు ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా(ఖీబీబబతిజీ) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఉక్రెయిన  సైనికు లు ఎదురుదాడిని తీవ్రతరం చేసి, పట్టు బిగిస్తున్న తరుణంలో.. రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడిరది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ  ఈ పరిణామాలను మరో విజయంగా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సైనికులు కీలకమైన  ఇజియంపట్టణాన్ని తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటినుంచి.. రష్యన్‌లు భయంతో పరుగులు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.’’ఈ రోజుల్లో.. రష్యన్‌ సైన్యం తన వెన్ను చూపడంలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. వారు పారిపోవడానికి ఇదే మంచి అవకాశం. ఉక్రెయిన్‌లో ఆక్రమణదారులకు చోటు లేదు’’ అని జెలెన్‌స్కీ ఎద్దేవా చేశారు. తమ సేనలు ఈ నెలలో ఇప్పటివరకు రెండు వేల చ.కి.విూ.ల కంటే ఎక్కువ ప్రాంతాన్ని విముక్తి చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కీవ్‌ సైనికుల ముందంజ కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్మీగా పేరు తెచ్చుకునేందుకుగానూ రష్యా సైన్యం పరుగులు పెడుతోందని జెలెన్‌స్కీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ యాండ్రీ యెర్మక్‌ వ్యంగ్యాస్త్రం విసిరారు. ఇజియం ప్రాంతాన్ని రష్యన్‌ దళాలు తమ లాజిస్టిక్స్‌ బేస్‌గా ఉపయోగించాయి. తాజాగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తూ మందుగుండు, ఇతరత్రా సామగ్రిని వదిలి పెట్టాయి. ఇదిలా ఉండగా.. యుద్ధం మొదలైన కొత్తలో కీవ్‌ను గుప్పిట పట్టాలన్న రష్యా ప్రయత్నాలను ఉక్రెయిన్‌ దళాలు తిప్పికొట్టాయి. ఇప్పుడు.. ఖర్కివ్‌ నుంచి రష్యా సేనలు వైదొలిగేలా చేయడం ద్వారా రెండో పెద్ద విజయాన్ని సాధించినట్లయింది. అయితే, డాన్‌బాస్‌ విూద పట్టు సాధించే క్రమంలో… కీలక ప్రాంతమైన దొనెట్స్క్‌ దిశగా దృష్టి సారించేందుకే బలక్లియా, ఇజియం నుంచి బలగాలను రీగ్రూప్‌ చేయాలని నిర్ణయించినట్లు రష్యా రక్షణ శాఖను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది.