ఎమ్మెల్యే కొరమట్లకు వైసిపి నేతల అభినందనలు

కడప,జూన్‌7(జనం సాక్షి):రైల్వే కోడూర్‌ వైసిపి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులుకు మండల వైసిపి నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం కొరముట్ల శ్రీనివాసులును కలిసిన మండల వైసిపి కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మలిశెట్టి వెంకటరమణ, లింగం లక్ష్మీకర్‌ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళుతున్న ఎమ్మెల్యే శ్రమ మాటల్లో చెప్పలేనిది అని నేతలంతా కొనియాడారు.