ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షాన పోరాటం

ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షాన పోరాటం హుజూర్ నగర్ నవంబర్ 25 (జనంసాక్షి): ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షాన పోరాటం నిర్వహిస్తుందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ సిపిఐ ఆఫీస్ నందు ఏఐటీయూసీ మండల కమిటీ సమావేశం ఇందిరాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ 102 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షాన పోరాట నిర్వహిస్తుందని ఈ దేశానికి సంపదసృష్టికర్తలైన కార్మిక వర్గాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికులు హక్కులను హరించి వేస్తుందని, పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడలుగా మార్చి వ్యాపార సులభతరం పేరుతో దేశ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, పాలకులు ప్రజల మీద నిత్యవసర వస్తువులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి వస్తువులపై జిఎస్టి విధించి ధరలు విపరీతంగా పెంచుతున్నారని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడశ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 27, 28, 29 న యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరుగు ఏఐటీయూసీ రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని, 27వ తారీఖున జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జెట్టి ప్రసాద్, కొత్తపల్లి లక్ష్మయ్య, గొల్లగోపు మల్లయ్య, పాలడుగు రాజు, బండి భాస్కర్, నల్లమాద వెంకటేశ్వర్లు, గూడపు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.