ఏసీడీ చార్జీలు వెంటనే రద్దు చేయాలి

* ఎస్టీ సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరి లాల్ నాయక్

టేకులపల్లి,జనవరి 24 (జనం సాక్షి ): విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధిక భారం మోపుతున్న ఏసిడి ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలినీ టేకులపల్లి మండల ఎస్టి సెల్ బానోత్ సరీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యుత్ శాఖ గత సంవత్సరం అధిక లోడు పేరుతో వేల రూపాయలు వసూలు చేసిందని, మళ్లీ ఇప్పుడు అడిషనల్ కన్స్యూమర్ డెవలప్మెంట్ ఛార్జెస్ (ఏసీడీ) పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపడం సరైనది కాదని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మితిమీరిన స్వేచ్ఛ ఫలితంగా విద్యుత్ వినియోగదారులపై భారాలు అధికమవుతున్నాయని, విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే కుట్రలో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ మీటర్లు ఇచ్చేటప్పుడే బ్యాంకులో, మీసేవలో వేల రూపాయలు చలానాలు వసూలు చేస్తూ మళ్ళీ ఇప్పుడు కన్జ్యూమర్ దగ్గర అడిషనల్గా వసూలు చేయడం దారుణమని అన్నారు. వినియోగదారులకు వాడుక బిల్లు కంటే ఏసీడీ బిల్లు మూడు రెట్లు అదనంగా వస్తుందని, ఇది ఏ పద్ధతుల్లో వసూలు చేస్తున్నారో కూడా వినియోగదారులకు సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.ఈ అధిక బిల్లులు వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారని అన్నారు. తక్షణమే విద్యుత్ వినియోదారులపై ఏసిడి పేరుతో వేస్తున్న అదనపు భారాలను రద్దు చేయాలని విద్యుత్ వినియోగదారుల సదస్సు సమస్యలవిద్యుత్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.