ఐటిఐ కళాశాల ప్రారంభమై 12 సంవత్సరాలు కావస్తున్న నేటికీ సొంత బిల్డింగు లేని దుస్థితి

-నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై నిర్లక్ష్యం
  -గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్
గద్వాల ప్రతినిధి డిసెంబర్ 21 (జనంసాక్షి):-గద్వాల నియోజకవర్గంలో ఐ.టి.ఐ కళాశాల అకాడమిక్ సంవత్సరం 2011లో ప్రారంభమైన నేటికీ సొంత భవనం లేని పరిస్థితి ఉన్నదని,నూతన భవన నిర్మాణం కోసం 2017 లో 4 కోట్లు వెచ్చించి,కాంట్రాక్టర్ తో 2018-19 లో అగ్రిమెంటు ప్రారంభమై,మూడు సంవత్సరాల కాల వ్యవధి ముగిసి మూడు సంవత్సరాలు కావస్తున్న కుడా ఇప్పటిదాకా సొంత భవనం లేదని,కేవలం పిల్లర్లు మాత్రమే వేసి 65 లక్షలకు పైగా బిల్లులు డ్రా చేసుకున్నారని,సొంత భవనం లేక మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పత్తి మార్కెట్ కు సంబంధించిన భవనాలలో క్లాసులు నడుపుతున్నారని ఈరోజు అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణ పనులను,సందర్శిస్తూ గొంగళ్ళ రంజిత్ కుమార్ విమర్శించారు. ఇకనైనా ఐ.టి.ఐ కళాశాల భవనాన్ని వెంటనే నిర్మించాలని,లేనిచో గడువు ముగిసి మూడు సంవత్సరాలు కావస్తున్న నిర్మాణం చేయని కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకొని భవనాన్ని పూర్తి చేయాలని అన్నారు.. కొత్త శిలాఫలకాలు, శంకుస్థాపనల పేరిట ప్రజలను మోసగించడం మాని మొదటగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.ఈ నియోజకవర్గం మొదటి నుంచి కుటుంబ పాలకుల వల్ల విద్యాభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని అన్నారు…ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, కార్యదర్శి తిమ్మప్ప, లక్ష్మన్న,రంగస్వామి,అంజి,గోపాల్,భీమన్ గౌడ్,ఎల్లేష్గుం.డన్న,శాంతన్న,తిరుపతన్న,రాము,భూపతి నాయుడు,అంజి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.