ఒమిక్రాన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉంది

ఇది విజృంభిస్తే మరింత తీవ్రం కావచ్చుహెచ్చరించిన ప్రపంచారోగ్య సంస్థ

12 దేశాల్లో కేసులు గుర్తించినట్లు వెల్లడి

జెనీవా,నవంబర్‌29(జనం సాక్షి): కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్‌ఒ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వైరస్‌ ఎంత స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. ఎంత ప్రమాదకరమైదన్న వాటిపై సందేహాలు మిగిలే ఉన్నాయని ఉద్ఘాటించింది. ’ఒమిక్రాన్‌ వల్ల కరోనా మరోసారి విజృంభించినట్లయితే.. పరిస్థితులు మరింత తీవ్రతరం కావచ్చు’ అని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరించింది. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌తో చనిపోయినట్లు నివేదికలు అందలేదని తెలిపింది. కరోనా నుండి రూపాంతంరం చెందిన మరో వేరియంట్‌ బి.1.1.529ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించినట్లు శుక్రవారం డబ్యుహెచ్‌ఒ ప్రకటించింది. దీనికి ఒమిక్రాన్‌ అని నామకరణం చేసింది. వర్గీకరణలో భాగంగా ఈ వేరియంట్‌ అత్యంత సమస్యాత్మక కేటగిరిలో ఉంచగా.. ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్యం చూపించిన డెల్టా, బలహీనమైన ఆల్ఫా, బీటా, గామాలు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సరికొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 దేశాలకు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి ఈ వైరస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కఠినమైన ప్రయాణ నిబంధనలు ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందడం ఆందోళనకరం. మాలావి రోడ్‌ నుండి టెల్‌ అవీవ్‌కు బస్సులో వచ్చిన ఓ ప్రయాణీకుడి ద్వారా ఓ కేసు వచ్చినట్లు ఇజ్రాయిల్‌ వెల్లడిర చింది. మరోవైపు కొత్త వైరస్‌ ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు పరుగులు పెడుతున్నారు. అయితే ఒమిక్రాన్‌పై టీకాలు ఏమాత్రం ప్రభావితం చేయవన్న ఆందోళనల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, దానికి సవిూపాన ఉన్న దేశాల నుండి రాకపోకలపై పలు ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ప్రస్తుతం ఈ వైరస్‌ను ఆయా దేశాల్లో గుర్తించాయి. దక్షిణాఫ్రికాలోని పలు ప్రావిన్స్‌ల్లో 1,100 మందిపై పరీక్షలు నిర్వహించగా.. 90 శాతం మంది ఈ కొత్త వైరస్‌ బారిన పడ్డారు. బోత్సువానా  దేశంలో 19 కేసులు వెలుగుచూశాయి. బ్రిటన్‌లో మూడు కేసులు బయటపడగా.. ఇవన్నీ కూడా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వారి వల్ల సోకినవే. జర్మనీలో రెండు కేసులు… దక్షిణాఫ్రికా నుండి మునిచ్‌ వచ్చిన వారిలో గుర్తించారు. నెదర్లాండ్‌ 13 కేసులను గుర్తించారు. డెన్మార్క్‌లో రెండు కేసులు, బెల్జియయంలో ఒక కేసు,ఇజ్రాయిల్‌లో ఒకటి నిర్దారణైంది. మరొకరి సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇటలీలో ఒకటి.. అయితే పాజిటివ్‌ నిర్దారణ కావడానికి ముందు దేశాన్ని చుట్టివచ్చినట్లు తెలుస్తోంది.చెక్‌ రిపబ్లిక్‌  ఒకటని స్థానిక విూడియా చెబుతోంది హాంగ్‌కాంగ్‌లో క్వారెంటైన్‌ హోటల్‌లో రెండు కేసులు వెలుగు చూశాయి. ఆస్టేల్రియా సౌత్‌వేల్‌ స్టేట్‌లో రెండు కేసులు బయటపడ్డాయి. కెనడాలో నైజీరియా నుండి వచ్చిన వారిలో ఇద్దరికీ వైరస్‌ సోకింది.