కరెంటు కోతలతో తెలంగాణ రైతు కుటుంబాల ఉసురు పోసుకుంటున్న అసమర్థ సీఎం కేసీఆర్

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(5):
భారతీయ జనతా పార్టీ ఉమ్మడి గోపాల్ పేట్ మండల కమిటీ అధ్యక్షులు అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు
కరెంటు కోతలకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నాకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు డా.ఏ.రాజవర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తానని,తెలంగాణ రైతు దేశానికి ఒక దిక్సూచిలా మారబోతాడని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల కాదుకదా కనీసం ఐదు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వరి నాట్లు వేసుకునే లక్షలాది మంది రైతులు కరెంటు సరఫరా లేక వరి నాటు కొరకై ఎదురుచూస్తున్నారని,రైతాంగ బాధలు పట్టని అసమర్థ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు అని ఆయన విమర్శించారు.అదేవిధంగారాష్ట్రంలో విద్యుత్ సంస్థలు నష్టాల్లో లేకున్నా కూడా రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా కరెంటు చార్జీలను పెంచిన ఘనుడు కేసీఆర్ అని ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అందరికీ సమధర్మం పాటించాల్సిన ముఖ్యమంత్రి ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఒక వర్గం ప్రజల విద్యుత్ చార్జీలను వసూలు చేయకుండా దాదాపు 19 వేల కోట్ల రూపాయల డిస్కమ్లకు బాకీ పడ్డారని కరెంటు చార్జీలు పెంచినా రైతులకు కరెంటు కోతలు లేకుండా సక్రమంగా విద్యుత్తు అందించలేక పోతున్నారనిదుయ్యబట్టారు,రాష్ట్రంలోని రైతులందరికీ సరిపడా ఎరువులు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చెల్లిస్తుందని గొప్పలు చెప్పిన కేసీఆర్ రెండేళ్లయినా ఇప్పటిదాకా ఒక రైతు కు కూడా ఒక యూరియా బస్తా ఉచితంగా ఇచ్చిన పాపాన పోలేదని,ఎన్నికల ముందు ప్రకటించిన రుణ మాఫీ కూడా హామీ లాగానే మిగిలిపోయిందని రుణమాఫీ అవుతుందని భావించిన రాష్ట్ర రైతాంగం రుణమాఫీ గాక ఇన్ ఫుట్ సబ్సిడీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా ఒక్క రూపాయి కూడా బ్యాంకులో ఇన్పుట్ సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదని దీనికి కారణం కెసిఆర్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలన్నారు.నీళ్లు,నిధులు,నియామకాల పేరిట పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని తన చేతగాని పాలనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సరైన ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారని 2023 ఎన్నికల్లో గోల్కొండ కోట పైన బీజేపీ జెండా ఎగరడం కాయం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి, సబిరెడ్డి వెంకట్ రెడ్డి, బి కృష్ణ, జింకల కృష్ణయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శులు మాధవరెడ్డి నారాయణ ,రామన్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు పెద్దిరాజు మనివర్ధన్ రాజు, రేవల్లి మండల అధ్యక్షులు అజయ్ గౌడ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణ యాదవ్ మాధవరెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు కేశవులు నాగరాజు జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వెంకటచలం వెంకటేష్ ఐటీ సెల్ కన్వీనర్ దామోదర్ మండల ఉపాధ్యక్షులు కృష్ణ వామన్ గౌడ్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ చారి చాకలి పల్లి సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తునికి అరుణ వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది కార్యక్రమం అనంతరం ఏ ఎల్ ఎం భగీరథ చారి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది