కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీసుల దాడులకు నిరసనగా ర్యాలీ

 

 

 

 

 

గంగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుపై కేసీఆర్ పాలన పై నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణపాక సరోజన మాట్లాడుతూ అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నార్ అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల మాజీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ రూమ్ సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు కంప్యూటర్ ల్యాప్ టాప్ లను ధ్వసం చేశారు. బారత రాజ్యాంగాన్ని ఉల్లంగించిన పోలీసులపై కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎలా అరెస్టు చేస్తారని వా పోయారు జరిగిన సంఘటన మండల నాయకులు ఖండించారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం జరిగిన రాష్ట్రంలోను కేంద్రంలోను నిరసన సెగలు చూస్తారని ప్రభుత్వ తీరును అభిశంచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాధారపు కొమురయ్య మాట్లాడుతూ నిన్న రాత్రి కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడినీ నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క  పిలుపు మేరకు ములుగు నియోజకవర్గం లోని గంగారం మండల కేంద్రాలలో యస్ టి సెల్ అధ్యక్షులు భుక్య బాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి సొలం బాబురావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,ముడిగ పోతయ్య,జాడి సాంబయ్య. గుడుపూరి సురేందర్, మహిళ అధ్యక్షులు ఈసం నర్సక్క, ఎన్ డ్రోలర్ జనగాం రామస్వామి, జనగాం క్రిష్ణ స్వామి, జనగాం భద్రయ్య  దుర్గం క్రీష్ణ, అక్క పెళ్లి సాంబయ్య గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దుర్గం శ్రీను రాజం లక్ష్మీనారాయణ పూనెం శ్రీకాంత్,ముడిగ సందిప్, జనగాం నరేష్. రక్షీత్, నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రభుత్వ   దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు హాజరైనారు.