కాల్పులవిరమణపై కుదరని ఒప్పందం!


` ఉక్రెయిన్‌` రష్యా విదేశాంగ మంత్రుల భేటీ..
అంకారా,మార్చి 10(జనంసాక్షి): ఉక్రెయిన్‌` రష్యా సంక్షోభంలో కీలక పరిణామం. ఒకవైపు ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతుండగానే.. మరోవైపు టర్కీలో రష్యా, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రులు సెర్గీ లాప్రోవ్‌, దిమిత్రో కులేబాలు భేటీ అయ్యారు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలికేందుకు టర్కీ దౌత్య ప్రయత్నాల ఫలితంగా.. ఇరు దేశాల మంత్రులు ఈ కీలక చర్చలకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం టర్కీలోని అంటల్యా డిప్లమసీ ఫోరం వేదికగా ఇరు పక్షాలు సమావేశమయ్యాయి. ఉక్రెయిన్లో రష్యా దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి.. ఇదే మొదటి అత్యున్నత స్థాయి సమావేశం కావడం గమనార్హం. టర్కీ విదేశాంగ మంత్రి మెలి?ట్‌ కావూసోగ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ మేరియు పొలోని ఓ ప్రసూతి ఆసుపత్రిపై రష్యా దాడులు జరిపిందన్న ఆరోపణలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతోన్న వేళ ఈ సమావేశం జరిగింది.సమావేశం అనంతరం ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి కుబా మాట్లాడుతూ.. ‘మేం.. 24 గంటలపాటు కాల్పుల విరమణ పై చర్చించాం. కానీ.. ఈ దిశగా ఎటువంటి పురోగతి సాధ్యపడలేదు. మేరియు పొలో మానవతా కారిడార్‌ ఏర్పాటుపై సానుకూల ఫలితం వస్తుందని భావించా. దీనికి సంబంధించి లాప్రోవ్‌ సరైన హావిూ ఇవ్వలేదు’ అని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రష్యాలో ఇతర నిర్ణయాధికారులు ఉన్నారని తెలుస్తోందన్నారు. ‘ఉక్రెయిన్‌ ఇప్పటివరకు లొంగిపోలేదు. లొంగిపోదు కూడా’ అని స్పష్టం చేశారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటే.. మళ్లీ లాబ్రోవ్‌ తో భేటీకి సిద్ధమన్నారు. ‘మేం దౌత్య ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నాం. అప్పటివరకు మా భూములను, ప్రజలను రష్యా నుంచి కాపాడుకునేందుకు అంకితభావంతో ముందుకెళ్తాం. త్యాగాలు చేస్తాం’ అని చెప్పారు.