కేంద్రం ప్యాకేజీ బూటకం..

` రాష్ట్రాల మెడులు వంచే నాటకం..`

తనపరువు తనే తీసుకున్న కేంద్రం

` దీన్నో ప్యాకేజీ అంటారా అంటూ కెసిఆర్‌ ఎద్దేవా

` ఆంక్షలతో రాష్ట్రాను బిక్షగాళ్లుగా చూస్తోందని మండిపాటు

హైదరాబాద్‌,మే 18(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీ వట్టి డ్లొ అని విమర్శించారు. మేమొకటి కోరితే.. కేంద్రం ఒకటి ఇచ్చిందని మండిపడ్డారు. కేబినెట్‌ భేటీ అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. రాషట్‌ఆరను నియంత్రించాని చూస్తోందని, వారుచెప్పినట్లుగా నడవాని కోరుకుంటోందని మండిపడ్డారు. ఇది ఫెడరల్‌ విధానానికి విఘాతమన్నారు.  విపత్తు వేళ రాష్ట్రాు ఒకటి కోరితే కేంద్రం ఇచ్చింది వేరని కేసీఆర్‌ అన్నారు. అసు ఇదో ప్యాకేజీ అంటూ వివిధ అంతర్జాతీయ జర్నళ్లలో వచ్చిన వార్తను ఉటంకించారు. కేంద్ర ప్యాకేజీ అంకె గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంచాని మేం అడిగితే సంస్కరణు అము చేస్తే ఇస్తామని కేంద్రం అంటోంది. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాను భిక్షగాళ్లను చేస్తారా? మున్సిపాలిటీల్లో ఛార్జీు పెంచితే రుణ పరిమితి పెంచుతారా? దీన్ని అసు ప్యాకేజీ అంటారా? ఇది పచ్చిమోసం. కేంద్రం దాని పరువు అదే తీసుకుంది. విపత్తు వేళ కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదు. మెడ విూద కత్తి పెట్టి ఇది చెయ్యి.. అది చెయ్యి అని చెప్పడం ప్యాకేజీనా? ఆ నిబంధను అము చేస్తేనే రుణాు ఇస్తామంటే అవి మాకు అక్కర్లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా లాంటి మహమ్మారిపై పోరు చేస్తున్న సమయంలో కేందప్రభుత్వం 20 క్ష కోట్ల రూపాయ పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్‌ అని సీఎం కేసీఆర్‌ కొట్టిపారేశారు. కేంద్రం ప్యాకేజీ అంకె గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని సీఎం ఎద్దేవా చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షు పెట్టారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వా పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని  సీఎం కేసీఆర్‌  మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీ దగా, మోసమన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాను భిక్షగాళ్లను చేస్తారా..అని సీఎం కేసీఆర్‌ కేందప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాకు తెలియకుండా ఉండదని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.  కేంద్రం తెంగాణకు 20 కోట్ల రుణ పరిమితి పెంచి, దరిద్రంగా ఆంక్షు పెట్టింది. కేంద్రం తన పరువు తానే తీసుకుందని నిప్పు చెరిగారు.