కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి

 …కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి …- ఇళ్లను మంజూరు చేస్తే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాలనీ పేరు పెట్టుకుంటాం …- కెనాల్ కాలువ డబ్బులు పట్టా లబ్దిదారుల ఖాతాలోనే వేయాలని ఆందోళన
బచ్చన్నపేట మార్చి 21 (జనం సాక్షి):
మండలంలోని కొన్నె  గ్రామంలో బీడీ కాలనీ పేరిట పట్టాదారుల నుండి కొనుగోలు చేసి ప్రభుత్వం ఇచ్చిన  పట్టాలపై డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గ్రామ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గ్రామంలోని 707 సర్వేనెంబర్ లోను 4-00 ఎకరాల భూమిని 1993 సంవత్సరంలోనూ  పట్టాదారుల నుండి 60 వేలకు కొనుగోలు చేసి లక్ష రూపాయల ఖర్చుతో అప్పటి ప్రభుత్వం బీడీ కాలనీ పేరిట 96 మందికి గాను 160 గజాల చొప్పున ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఇట్టి పట్టాలపై చదును చేసుకొని ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని, బీడీ కాలనీ లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బీడీ కాలనీ వాసులకు ఇల్లు మంజూరు చేస్తే ముత్తిరెడ్డి కాలనీ పేరుతో ఇల్లు నిర్మించుకుంటామని లబ్ధిదారులు కుందారం అనసూర్య, పసుల పద్మ, పసుల కనకవ్వ, వి రాజమౌళి ఎం. ఆదిరెడ్డి, పసల ఎల్లమ్మ, పిట్టల శ్యామల, కుర్రాము నరసవ్వ, వి. విజయలక్ష్మి 90 మంది మేరకు లబ్ధిదారులు కోరుతున్నారు …