గోలియా తండాలో పోడు భూముల గ్రామసభ

టేకులపల్లి, నవంబర్ 23( జనం సాక్షి ): టేకులపల్లి మండల పరిధిలోని గొల్యతండ గ్రామ పంచాయతీ లో పొడు భూముల గ్రామసభ సర్పంచ్ బొడ నిరోష అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ గ్రామ సభ లో స్పెషల్ అధికారి తిరపతయ్య, సర్పంచ్ బొడ నిరోష మాట్లాడుతూ పంచాయతీ మొత్తం పోడు భూములకు సంబంధించి దరఖాస్తుదారులు152 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 134దరఖాస్తులను అమెాదించడం జరిగిందన్నారు. అందులో 18 అప్లికేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరించడం జరిగిందని, అమెాదించిన అప్లికేషన్లు మెుత్తం అటవీశాఖ, ఐటీడీఏ కార్యాలయం కు పంపించడం జరుగుతుందని, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపగరని వారు అన్నారు. అనంతరం గ్రామ సభ కి వచ్చిన రైతులు చేతులు పైకి ఎత్తి అభ్యంతరం లేదని తెలిపారు. గ్రామ సభ కు ముందు దాడి లో చనిపోయిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు కి సంతాపం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి. ప్రశాంత్, అటవీ శాఖ అధికారి బజార్, అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్ గుగులోతు. రాంచందర్, అటవీ హక్కుల కమిటీ కార్యదర్శి యల్ నాక, ఉప సర్పంచ్ బండి రాధ 7వ వార్డు సభ్యులు అనంతుల వెంకన్న,పంచాయతీ సిబ్బంది నెహ్రూ, సురేష్, లాలు పొడు రైతులు తదితరులు పాల్గొన్నారు.