గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు
ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా ఫలితంగా ఇప్పటికే ఇక్కడి నుంచి ముడి గ్రానైట్‌ ఎగుమతి చేసే ఖమ్మంలోని గ్రానైట్‌ కటింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ యూనిట్ల ఎగుమతు బంద్‌ అయి సంక్షోభంలో పడ్డాయి. అంతేగాకుండా గ్రానైట్‌ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏటా రూ.16కోట్లకుపైగా ఆదాయం వస్తుండగా ఇది గణనీయంగా తగ్గనుంది. నాణ్యమైన బ్లాక్‌ గ్రానైట్‌ ఖనిజ న్విు సమృద్ధిగా జిల్లాలో ఉన్నాయి. చైనాలో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభించడంతో ఆ దేశం నుంచి వస్తుఉత్పుత్తు ఎగుమతి, దిగుమతు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమల్లో ఇప్పటికే 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాు కనిపిస్తున్నాయి. ఎగుమతు తగ్గుతున్న క్రమంలో గ్రానైట్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికు, అనుబంధ రంగా కార్మికు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశాు కనిపిస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి దేన్నీ వదడంలేదు. వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కుప్పకూలింది. తాజాగా జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమ సైతం అదే దారిలో పయనిస్తోంది. ఇక్కడి గ్రానైట్‌ ఉత్పత్తు ప్రధానంగా చైనా దేశానికి ఎగుమతి అవుతుంటాయి. జిల్లాలో వివిధ రకా ఖనిజాు ఉత్పత్తి అయ్యే క్వారీు విస్తరించి ఉన్నాయి. ఈ పరిశ్రమన్నీ కేసముద్రం, డోర్నకల్‌, నెల్లికుదురు, కురవి, గూడూరు, మరిపెడ, తొర్రూరు, గార్ల, బయ్యారం మండలాల్లో ఏర్పాటై
ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా బ్లాక్‌ గ్రానైట్‌ 27క్ష క్యూబిక్‌ విూటర్ల న్విు ఉన్నట్లు భూగర్భ గను శాఖ అంచనా వేస్తోంది. చైనా దేశం నుంచి పు కంపెనీ తరపున మైనింగ్‌ నిపుణు ఇక్కడికి వచ్చి
క్వారీను పరిశీలిస్తారు. ఆ తర్వాత వెలికితీసిన సరుకును కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుకు తరలించి అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తారు. ఇక రాళ్లను బ్లాసింగ్‌ చేయకుండా వాటి నాణ్యత దెబ్బతినకుండా పగుగొట్టేందుకు ’కెమికల్‌ పౌడర్‌’ను ఉపయోగిస్తారు. దీన్ని కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు.