ఘనంగా గణతంత్ర వేడుకలు

ఢిల్లీ  జనవరి 26 (జనంసాక్షి):  తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం గర్వ కారణం అని అన్నారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొందని తెలిపారు. భారత్‌ బయోటెక్‌ తొలి గణతంత్ర వేడుకలు జరిగాయి. బ్రిటన్‌ ప్రధాని రావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆయన రాలేక పోయారు. ప్రధాని మోడీ,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సైనిక దళాలు తమ సత్తా చాటాయి. అలాగే రాఫెట్‌ యుద్ద విమానాలు,. అయోధ్య ఆలయ నమూనా ఈ సారి ప్రత్యేక ఆకర్శణగా నిలియచాయి.ఇకపోతే ఆర్మీపరేడ్‌ సందర్భంగా ఎర్రకోట వద్ద ఉన్న మెట్రో స్టేషన్‌ ఎగ్జిట్‌ గేట్లను మూసివేశారు.  ఎంట్రీకి అనుమతి ఇచ్చినా.. ఎగ్జిట్‌ మాత్రం మూసి ఉంటుంది.    సైనిక దళాలు తమ సత్తాను చాటాయి.  ఇండియన్‌ ఆర్మీకి చెందిన టీ-90 భీష్మ యుద్ధ ట్యాంక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  పరేడ్‌ సందర్భంగా టీ-90 భీష్మను ప్రదర్శించారు. 54వ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్‌ కరణ్‌వీర్‌ సింగ్‌ భంగూ .. ట్యాంక్‌తో ప్రదర్శన చేపట్టారు.  పరేడ్‌లో బంగ్లాదేవ్‌ ఆర్మీ బ్యాండ్‌ కూడా పాల్గొన్నది.  లెప్టినెంట్‌ కల్నల్‌ అబూ మొహమ్మద్‌ షానూర్‌ షావన్‌ నేతృత్వంలో ఈ బ్యాండ్‌ ర్యాలీ తీసింది. తొలిసారి బంగ్లా బ్యాండ్‌ పాల్గొన్నది. దీంట్లో 122 మంది సభ్యులు ఉన్నారు.  బ్ర¬్మస్‌ మిస్సైల్‌కు చెందిన ఆటోనమిస్‌ లాంచర్‌ను ప్రదర్శించారు.  కెప్టెన్‌ ఖమ్రుల్‌ జమాన్‌ నేతృత్వంలో బ్ర¬్మస్‌ను ప్రజెంట్‌ చేశారు.  ఇండియా, రష్యా దేశాలు సంయుక్తంగా ఈ మిస్సైల్‌ వ్యవస్థను డెవలప్‌ చేశాయి.  400 కిలోవిూటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను బ్ర¬్మస్‌ చేధించగలదు. 841 రాకెట్‌ రెజిమెంట్‌కు చెందిన పినాకా మల్టీ లాంచర్‌ రాకెట్‌ సిస్టమ్‌ను  పరేడ్‌లో ప్రదర్శించారు.  కెప్టెన్‌ విభోర్‌ గులాటీ ఈ టీమ్‌ను లీడ్‌ చేశారు.  214 ఎంఎం పినాకా ఎంబీఆర్‌ఎల్‌.. అడ్వాన్స్‌డ్‌ రాకెట్‌ సిస్టమ్‌. ఇది సంపూర్ణంగా ఆటోమెటిక్‌ లాంచర్‌.  అతి తక్కువ సమయంలోనే ఈ రాకెట్‌ ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. గణతంత్ర వేడుకల పరేడ్‌లో ప్రదర్శితమైన శకటాల్లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ శకటం ఆహుతులను ఆకట్టుకున్నది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం డిజైన్‌తో ఉత్తరప్రదేశ్‌ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు భాగంలో వాల్మీకి అసీనులై రామాయణ రచన గావిస్తున్నట్లుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో నూతన డిజైన్‌ ఆధారంగా రామ మందిరాన్ని తీర్చిదిద్దారు. ఇక యూపీ శకటాల్లోని మధ్య శకటం ముందు భాగంలో అయోధ్య దిపోత్సవాన్ని తలపించేలా దీపాలను వెలిగించారు. శకటాల ప్రదర్శనలో లఢఖ్‌ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరేడ్‌లో లఢఖ్‌ శకటం ముందుగా వెళ్తుండగా ఇతర రాష్ట్రాల శకటాలు దానిని అనుసరించాయి. లఢఖ్‌లోని లలిత కళలు వాస్తుకళ, భాషలు యాసలు, అచార వ్యవహారాలు, ఉత్సవాలు పండుగలు, సాహిత్యం, సంగీతంతోపాటు ఆ ప్రాంత సంస్కృతి, మతసామరస్యం ఉట్టిపడేలా శకటాన్ని రూపొందించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లఢఖ్‌ శకటానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రదర్శితమైన తొలి శకటంగా ఈ లఢఖ్‌ శకటం గుర్తింపు పొందింది.