ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ బీ జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి అయిలమ్మ 127 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రజక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షులు నడిగొట తిరుపతి మాట్లాడుతూ… రజకులకు ప్రభుత్వం ద్వారా అందవలసిన ఎటువంటి పథకాలు అందడం లేదని, ప్రభుత్వం రజకులను చిన్నచూపు చూస్తుందని వాపోయారు. రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ నందు చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బిజిగిరి సంపత్, ప్రధాన కార్యదర్శి నడిగొట శంకర్, సహాయ కార్యదర్శి పున్నం సమ్మయ్య, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, జలగం రాజేశ్వరి,రాచర్ల కోమల, దబ్బేటి కనకయ్య, నిమ్మలరమేష్, సంఘ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు