చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన

జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలు
సంబరాలు జరుపుకున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సిబ్బంది
జనం సాక్షి, చెన్నరావు పేట
పే స్కేల్  జీవో నెంబర్ 11  ను  గ్రామీణ పేదరిక నిర్మూలన సిబ్బందికి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించినందుకు,సిబ్బంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సంతోషాలను వ్యక్తం చేస్తూ, మిఠాయిలు పంచుకొని,ముఖ్యమంత్రి,మంత్రిలకు, ఎమ్మెల్యేకి,కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట, నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, నెక్కొండ మండలాల సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూసిబ్బంది కి పే స్కేల్  జీవోను జారీ చేస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, తద్వారా సంపూర్ణ గ్రామీణ అభివృద్ధికి కంకణ బద్దులమై ఉన్నామని, ప్రతి మహిళ ఆర్థిక, సామాజిక చైతన్యంతో, అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని, ఈ దిశలో పనిచేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూల సిబ్బందికి ఈ జీవోను అమలు చేస్తూ  4000 కుటుంబాలలో సంతోషాలు నింపాడని, సిబ్బంది నిబద్ధతగా ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ 21 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు ఈ పండుగ వేళ ఈ జీవో ద్వారా సంతోషాలను పంచి, మమ్మల్ని అక్కున చేర్చుకున్న ప్రభుత్వానికి, రుణపడి ఉన్నామని తెలిపారు, మహేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల మాదిరిగా మమ్మల్ని వాడుకుని వదిలేయకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ ను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. లక్ష్యాలను నెరవేర్చడంలో మా సిబ్బంది కూడా మొక్కవని దీక్షతో పనిచేస్తామని తెలిపారు.ఏపిఎం శ్రీను మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా మా జీవితాలలో గుర్తిండిపోతుందని, తెలుపగా సుధాకర్, సునీత లు చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న కళ నెరవేరడం, మా జీవితాలలో నూతన వెలుగులు, ఉగాది సంతోషాలు ముందుగానే ఈ జీవో ద్వారా వచ్చాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి కమ్యూనిటీ కోఆర్డినేటర్లు కట్టయ్య, మంజుల, సుజాత, పద్మ, నూరిన్నిసా, యాకూబ్, మహేందర్, ఏలియా తదితరులు పాల్గొన్నారు.