జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జగిత్యాల శివ వీధి ఆల్ఫోర్స్ ఇ

జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జగిత్యాల శివ వీధి ఆల్ఫోర్స్ ఇ టెక్నో విద్యార్థులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జగిత్యాల శివ వీధి ఆల్ఫోర్స్ ఇ టెక్నో విద్యార్థులు
జగిత్యాల టౌన్ (జనంసాక్షి )25 నవంబరు
విద్యార్థులకు చదువుతోపాటు సోషల్ అవేర్నెస్ ను కల్పించే ఉద్దేశంతో పోలీసు వారి విధులు మరియు వాటి నిర్వహణ తెలియజేయు క్షేత్ర పర్యటనలో భాగంగా ఆల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారుఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ  రాము విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ లో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల నష్టాలు, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల నష్టాలు, ఆల్కహాల్ అనాలసిస్ వంటి అంశాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు,జగిత్యాల పట్టణ ఎస్ఐ బి సంజీవ్ విద్యార్థులకు రోజువారి జనరల్ డైరీ మరియు రిసెప్షన్, ఎఫ్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఆయుధాల రికార్డు, వైర్లెస్ సెట్ ఆపరేటింగ్ సిస్టం, నేరాల యొక్క రికార్డులను ఆన్లైన్ చేయడం వాటిని, మహిళల భద్రత సంబంధించి షీ టీమ్స్ నిర్వహణ, వంటి అంశాలను విద్యార్థులకు వివరించారుఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కిషోర్, ఎస్సైలు సంజీవ్, ట్రాఫిక్ ఎస్ఐ రాము, కానిస్టేబుల్స్ జితేందర్, రమేష్, లకుపతి, ట్రాఫిక్ కానిస్టేబుల్  మురళి లు  పాల్గొన్నారు.