జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్‌ ఎª`లో 6030 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 విూటర్లు కాగా…ప్రస్తుత నీటి మట్టం 242 విూటర్లకు చేరింది. ఖానాపూర్‌ మండలంలోని మేడంపెల్లి సవిూపంలో గల సదర్‌మాట్‌ ఆనకట్టకు భారీగా వరద రావటంతో ఉదృతిగా ప్రవహించింది. ఎగువన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుండి గేట్లు ఎత్తటంతో సదర్‌మాట్‌ పొంగి ప్రవహించింది. దీంతో 46935 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెలుతుందని, లెఫ్‌ కాలువకు 369, రైట్‌ కాలువకు 25 క్యూసెక్కుల నీరు వదిలినట్లు జేఈ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.