జిల్లా సైన్స్ ఫేర్లో రంగాపూర్ విద్యార్థుల ప్రతిభ

ఆటోమేటిక్ – వాష్ బుల్ టాయ్ లెట్ రూపకల్పన
•ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులు
జనం సాక్షి,వంగూర్:
జిల్లా సైన్స్ ఫెయిర్ లో వంగూరు మండలంలోని రంగాపూర్  జడ్పీహెచ్ఎస్ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు సాయికిరణ్ మరియు కిరణ్  ఆటోమేటిక్ వాషబుల్ టాయిలెట్ ను రూపకల్పన చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా ద్వితీయ స్థానంలో బహుమతి సాధించి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చేతుల మీదుగా ప్రశంస పాత్రలు పొందారు. ఆరోగ్యం – పరిశుభ్రత అంశంలో భాగంగా “ఆటోమేటిక్ – వాష్ బుల్” అంశమును ప్రదర్శించారు. పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు మల్లయ్య  సలహా, సూచనలతో ప్రదర్శనలో వివిధ అంశముల గురించి చక్కగా వారు వివరించారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని పరిశుభ్రతలో భాగంగా మనుషులు ఉపయోగించే మరుగుదొడ్లు సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడే పరిసరాలు కాలుష్యానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటాయన్నారు.అందుకే ఒక కొత్త రూపకల్పనకు ఆవిష్కరణ చేసినట్లు వివరించారు.అదే టాయిలెట్ ఉపయోగించిన తర్వాత దానంతట అదే శుభ్ర పరుచకొనే విధంగా తయారు చేసిన వాటిని నమూనా రూపంలో విద్యార్థులు క్లుప్తంగా వివరించారు. ఈ నమూనాను తిలకించి విన్న పలువురి విద్యావంతుల ప్రశంసించారు. అనంతరం బహుమతి సాధించిన సందర్భంగా రంగాపూర్ పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఉపాద్యాయులు, గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.