టాటా స్టీల్ చెస్ ఇండియా మహిళల నాల్గవ టోర్నీ

ఖైరతాబాద్ : ఆగస్టు 17 (జనం సాక్షి) టాటా స్టీల్ చెస్ ఇండియా నాల్గవ ఎడిషన్‌లో మహిళల ఎడిషన్ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఈ ఓపెన్ టోర్నమెంట్ మూడు ఎడిషన్లగా కొనసాగుతోంది.ఇప్పుడు దాని నాల్గవ ఎడిషన్‌లో టీఎస్‌సీఐ అదే ఫార్మాట్‌లో మహిళల టోర్నమెంటుని కలిగి ఉంటుంది.రాపిడ్, బ్లిట్జ్ 2022 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు కోల్కతా వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. అగ్రశ్రేణి అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ టోర్నమెంట్‌కి అంబాసిడర్‌గా, సలహాదారుగా ఈ సంవత్సరం పోటీని సుసంపన్నం చేయనున్నారు. ఈ ఆట చరిత్రలోనే తొలిసారిగా పురుషుల, మహిళల కేటగిరీ రెండింటికీ ప్రైజ్ ఫండ్ సమానంగా ఉండబోతుంది. ఈ సందర్భంగా టాటా స్టీల్ చెస్ ఇండియా అంబాసిడర్ విశ్వనాథన్ ఆనంద్ మాట్లాడుతూ.. చదరంగం ఒక ప్రధాన స్రవంతి క్రీడగా భావించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. టాటా స్టీల్ చెస్ ఇండియా వంటి టోర్నమెంట నేడు, భారతదేశాన్ని పురుషులు, మహిళలు సమానంగా ఈ క్రీడలో రాణిస్తున్న చెస్ పవర్‌హౌస్‌గా పరిగణిస్తున్నారు.