ఢల్లీిలోనే తేల్చుకుంటాం


` ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వండి
` అమరులైన రైతుకుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున
రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
` కేంద్రం కూడా రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి
` నీటి వాటా తేల్చండి..
` మా సహనాన్ని పరీక్షించొద్దు
` వానకాలం పంట ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
` రైతులపై కేసులు ఎత్తివేయాలి
` కనీస మద్ధతు ధర కోసం చట్టం చేయాలి
` ధాన్యం కొనుగోళ్లపై తేల్చుకునేందుకు నేడు ఢల్లీికి
` బీసీ కులగణనను వెంటనే చేపట్టాలి
` విూడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ
హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి):యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర సాగుచట్టాల రద్దు, కృష్ణా జలాల వాటా, గిరిజన రిజర్వేషన్లు,ఎస్సీ వర్గీకరన తదితర అంశాలపై శనివారం సాయంత్రం ఆయన తెలంగాణ భవన్‌లో విూడియా మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్ల సంగతి తేల్చాలని, బిసి కుల గణన చేపట్టాలని, ఎస్సీ వర్గీకరణ సమస్యకు ముగింపు పలకాలని అన్నారు. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధరలు ప్రకటించే చట్టం తేవాలన్నారు. ఈ సమస్యలపై పార్లమెంటులో పోరాడుతామని ప్రకటించారు. ఇదే సందర్బంగా ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్టాన్రికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు విూద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేకుండా పోయిందన్నారు. ఎటువంటి సమాధానం కూడా రావడం లేదని మండిపడ్డారు. మేం కోరేందంటే అన్ని రాష్టాల్రనుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్‌ ఇవ్వండి.. దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఇక్కడి రైతులను చైతన్యం చేస్తామని అన్నారు. ఎందుకోమరి సరైన పద్ధతుల్లో రావడం లేదు. మొన్న ధర్నా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. చివరి ప్రయత్నంగా రేపు ఢల్లీికి వెళ్తున్నట్లు కెసిఆర్‌ వివరించారు. మంత్రుల డెలిగేషన్‌, పార్లమెంట్‌ సభ్యులు డెలిగేషన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఫైనాన్స్‌ సెక్రెటరీ, అగ్రికల్చర్‌ సెక్రెటరీ, సివిల్‌ సప్లయ్‌ సెక్రెటరీ అధికారులు డెలిగేషన్‌ కలిసి మంత్రిని, అధికారులను అవసరమైన పక్షంలో ప్రధానిని కలిసి డిమాండ్‌ చేద్దాం అనుకుంటున్నట్లు వెల్లడిరచారు. ఎందుకంటే అనురాధ కార్తె నిన్న ప్రారంభమైంది. రైతులు ఏదో ఒకటి తేల్చకపోతే కన్ఫ్యూజన్‌లో ఉంటరు. అనవసరమైన ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటది. రైతులు తమకు ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. మొన్న గాలివార్త వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు విూద మాట్లాడుతామని, బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పినట్లు వార్త వచ్చింది. మరి అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢల్లీికి వెళ్తున్నట్లు వెల్లడిరచరు. బహుశా రెండు రోజులు పట్టొచ్చు. దాని దరిమిలా తెలంగాణ రైతాంగానికి ఏందనేది విషయాన్ని తెలుపుతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇకపోతే తెలంగాణలో చివరి గింజవరకు కొంటామని,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కొన్నట్లుగానే కొంటామని అన్నారు. ఇకపోతే సాగుచట్టాలను రద్దు చేయించడంలో భారత రైతాంగం గొప్ప విజయం సాధించిందని.. గత 13 నెలల నుంచి రైతులు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు నేడు ముగింపు పలికామని.. దేశ రైతాంగానికి మొత్తం సేప్టీ వచ్చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం రైతు విజయం అని స్పష్టం చేశారు. రైతుల ఉద్యమ సమయంలో చాలామంది రైతులపై కేంద్రం దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టిందని.. రైతుల విూద పెట్టిన అన్ని కేసులను వెంటనే కేంద్రం ఎత్తివేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏదో సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. రైతుల విూద పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలి. కర్ణాటకలోని బెంగళూరులో ఓ అమ్మాయి రైతులకు సంఫీుభావంగా ఓ ట్వీట్‌ చేస్తే ఆ అమ్మాయిపై కూడా కేసు పెట్టారు. తక్షణమే ఇటువంటి కేసులన్నింటినీ ఎత్తేయాలి. మళ్లీ రైతులను వేధించకూడదు. వెంటనే విత్‌డ్రా చేసుకోండి అని ప్రధాని మోదీని సీఎం డిమాండ్‌ చేశారు. అలాగే మద్దతు ధరలకు సంబంధించి చట్టం తీసుకుని రావాలన్నారు. చాలా దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం వల్ల 700 నుంచి 750 మంది రైతులు ఆత్మార్పణం చేశారు. గుండెజబ్బులు వచ్చి.. ఒత్తిడికి లోనయి కొందరు.. ఇతర కారణాల వల్ల కొందరు చనిపోయారు. వాళ్లందరికీ సంఫీుభావం ప్రకటిస్తున్నాం. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడకూడదు కాబట్టి.. ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత ప్రధాని తీసుకోవాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.తెలంగాణ ప్రభుత్వం నుంచి అమరుల కుటుంబాలకు 3 లక్షల సాయం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చనిపోయిన రైతుల ప్రతి కుటుంబానికి 3 లక్షల సాయం అందిస్తుంది. దాని కోసం రూ..22.5 కోట్లు దానికి ఖర్చు అవుతాయి. రైతు నాయకులను సంప్రదించి.. ఆ కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. అది మామూలు విజయం కాదు. వాళ్లకు నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ల పోరాటాన్ని కీర్తిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలి. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం అందించాలి. కేసులు ఎత్తివేయాలి.. అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. మేము అడిగేది మూడే. ఒకటి చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షలు. రెండోది.. రైతులపై నమోదయిన కేసులన్నీ ఎత్తేయాలి. మూడోది.. కనీస మద్దతు ధర చట్టం తీసుకొని రావాలి. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లోనూ దానిపై పోరాటం చేస్తాం. ప్రతి రైతు అడుగుతున్నది మినిమమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌.. మాగ్జిమమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌ అడుగుతలేరు. దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు కనీస మద్దతు ధరను డిమాండ్‌ చేస్తున్నాయి. వచ్చే పార్లమెంట్‌ సమావేశంలోనే ఆచట్టాన్ని పెట్టాలి. మేము కూడా దానిపై పోరాటం చేస్తం.. అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇకపోతే విద్యుత్‌ చట్టం తెచ్చి రాష్టాల్రపై ఒత్తిడి తెస్తున్నారు. మా రాష్ట్రంలో విూటర్లు పెట్టే ఉద్దేశం లేదు. మాపై ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్టాల్ల్రో విూటర్లు పెట్టుకుంటె ఇబ్బంది లేదు. విద్యుత్‌ చట్టాలన్ని వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలి. నదులలో నీటి వాటా కేటాయింపులపై రేపు మళ్ళీ జలశక్తి మంత్రిని కలుస్తా. టైం పిరియడ్‌ పెట్టి వాటా తేల్చాలని కోరుతాం. టైం పిరియడ్‌ పెట్టకుంటే.. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఇతర రాష్టాల్ర మద్దతు కూడా తీసుకుంటామన్నారు. నీటి వాటాలు తేల్చాలన్న న్యాయబద్ద డిమాండ్‌ అమలు చేయాలన్నారు. కాలయాపనలేకుండే త్వరగా పూర్తి చేయలని కెసిఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. గిరిజనుల రిజర్వేషన్లను కూడా కేంద్రం తేల్చాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున గిరిజన ఉధ్యమాలు మొదలవుతాయి. ఎస్సీ రిజర్వేషన్లు కూడా వీలైనంత త్వరగా తేల్చాలి. బీసీ కులగణనను వెంటనే చేపట్టాలి. ఎందుకు బీసీ కుల గణన చేయట్లేని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలాగే బీసీ కులగణన చేయాల్సిందే అన్నారు. ప్రభుత్వమే కులం సర్టిఫికెట్‌ ఇచ్చినపుడు.. బీసీ కులగణన చేయడానికి ఏం ఇబ్బంది. రాష్ట్ర బీజేపీ నేతల బండారు బయటపడ్డది. ప్రజల ముందు స్థానిక బీజేపీ నేతలు తప్పు ఓప్పుకొని క్షమాపణ కోరాలి. వర్షాకాల చివరి గింజ వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. విూడియా సమావేశంలో మంత్రులు,పార్టీ నేతలు పాల్గొన్నారు.