తైపీ చేరుకున్న నాన్సీ పెలోసి

యుద్ద ట్యాంకులను దింపిన చైనా

తైపీ,ఆగస్ట్‌3( జనం సాక్షి): చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌లోని అమెరికా ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసి అడుగుపెట్టారు. దీంతో అప్రమత్తమైన చైనా… 20కి పైగా యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని తైవాన్‌ అధికారులు తెలిపారు. తైవాన్‌ నైరుతిలోని ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌ (ఎడిజ్‌)లోకి ప్రవేశించాయని ఆ ద్వీప దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. నాన్సీ ఫెలోసి తైవాన్‌లోని అడుగుపెట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా చైనాలోని బోర్డర్‌ పట్టణాల్లో యుద్ధ ట్యాంక్‌లను మోహరించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. తైవాన్‌ తమకు చెందిన భూభాగం అని చైనా చెబుతున్న విషయం తెలిసిందే. మరో వైపు తైవాన్‌ స్వతంత్య దేశమని, దానికి అమెరికా అండగా నిలుస్తోంది. మరో వైపు చైనాకు వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా.. ఈస్ట్‌ ఐలాండ్‌లో నాలుగు యుద్ధనౌకలను మోహరించింది