దీక్ష ఇక్కడకాదు..మోదీ ఇంటిముందు చేయండి

` నిరుద్యోగుల విషయంలో భాజపావి దొంగనాటకాలు
` సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాస్తాన్న మోదీ హామీ ఏమైంది?
` ప్రతిపక్షాల విషపు ప్రచారాలను యువత, నిరుద్యోగులు నమ్మొద్దు
` టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజలో బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..
` భారతదేశానికి పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ
` చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వం ఆసరా కల్పిస్తోంది
` రంగారెడ్డి జిల్లా నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభలో కేటీఆర్‌
రంగారెడ్డి (జనంసాక్షి):బీజేపీ నిరుద్యోగ మార్చ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్‌ చేయాల్సింది తెలంగాణలో కాదు.. ఢల్లీిలో మోదీ ఇంటి ముందు చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేటీఆర్‌ సూచించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని యువత, నిరుద్యోగులకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాపెద్ద అంబర్‌పేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.బీజేపీ నేతలు నిరుద్యోగుల కోసం ధర్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఆ మాట ప్రకారం ఈ 9 ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నా.. బీజేపీ నాయకుల్లారా.. కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా.. నిరుద్యోగ మార్చ్‌.. ఇక్కడ కాదు.. ఢల్లీిలోని నరేంద్ర మోదీ ఇంటి ముందు చేయాలి అని కేటీఆర్‌ సూచించారు.రైతుల ఆదాయండబుల్‌ చేస్తనని చెప్పాడు. కానీ రైతుల కష్టాలు డబుల్‌ అయ్యాయి. నల్లధనం ఎక్కడ అని అడిగితే తెల్లముఖం వేస్తున్నాడు. దేశంలో ఎవరైనా అసమర్థత ప్రధాని ఉన్నారంటే.. అతను మోదీనే. విూ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా లేవా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రంగ సంస్థలు అమ్ముతూ.. లక్షల ఉద్యోగాలకు పాతర వేస్తలేరా..? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ.. మా తమ్ముళ్ల నోట్లో మట్టి కొడుతూ.. విూరు నిరుద్యోగ మార్చ్‌ చేస్తే నమ్మేందుకు ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అని అనుకుంటున్నారా..? ఇది హుషారైన తెలంగాణ.. కేసీఆర్‌ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ. విూ చిల్లర మల్లర మాటలకు పడిపోయే తెలంగాణ కాదు. ఎవరు ఏందో మాకు తెలుసు అని కేటీఆర్‌ తెలిపారు.విూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వ కొలువుల్లో 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకు తీసుకొచ్చిన కేసీఆర్‌ మాకు అండగా ఉన్నాడని కేటీఆర్‌ పేర్కొన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పేపర్‌ లీకేజీ అయింది వాస్తవమే. వెంటనే ఆయా పరీక్షలను రద్దు చేశాం. జరిగిన నష్టానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. టీఎస్‌పీఎస్సీతో విద్యాశాఖకు, ఐటీ శాఖకు సంబంధం ఉండనే ఉండదు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. కేవలం నిధులు, కార్యదర్శిరూపంలోనే ప్రభుత్వం సహకారం ఉంటుంది. ఇంత ఇంగితజ్ఞానం లేని వారు మన ప్రతిపక్షంలో ఉండటమనేది దురదృష్టకరం అని కేటీఆర్‌ విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తమ్ముళ్లకు, చెల్లెళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. వాళ్లందరి కంటే ముఖ్యమంత్రికి, మాకు విూపై ప్రేమ ఉన్నది కాబట్టే తప్పులు జరగొద్దన్న ఉద్దేశంతో పరీక్షలను రద్దు చేశాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. జరిగిన లోటుపాట్లను సవరించుకుని బ్రహ్మాండంగా ముందుకు పోతాం. జరిగిన నష్టానికి అందరం చింతిస్తున్నాం. దయచేసి ఈ చిల్లరగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కుకోకండి. వాళ్ల కుట్ర మాకు తెలుసు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన నాడే ఇదే బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మాకు దగ్గర కాకుండా కుట్ర చేస్తున్నారని మాట్లాడారు. అందుకే మొత్తం ఉద్యోగ నియామకాలకే పాతర వేసే కుట్ర జరుగుతుంది. ఉద్యోగ నియామక ప్రక్రియను ఆపే కుట్ర జరుగుతుంది. యువతను, నిరుద్యోగులను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుంది.. దానికి లోను కాకండి అని కేటీఆర్‌ సూచించారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌నాయకత్వంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది.. చంటి బిడ్డ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఏదో రకంగా ఆసరా అందుతోంది. ప్రతి రంగాన్ని కూడా కేసీఆర్‌ సునిశితంగా గమనిస్తూ, మంత్రులకు సూచనలు ఇస్తూ.. ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌పేర్కొన్నారు.ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి కుమారుడు ప్రశాంత్‌ రెడ్డి 63 రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. 95 గ్రామాల విూదుగా.. 775 కిలోవిూటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా పెద్ద అంబర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎసప్రగతి నివేదన సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.పాదయాత్ర ద్వారా ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లిన ప్రశాంత్‌ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నానని కేటీఆర్‌ తెలిపారు. ప్రజాప్రతినిధి కావాలనే నాయకుడు ప్రజలకు ఆశయాలకు, ఆలోచనలకు ప్రతినిధిగా ఉండాలి. నాలుగు ఓట్లు వేసుకుని గెలిచిన తర్వాత టర్మ్‌ అయిపోగానే దిగిపోయే నాయకుడు ప్రజాప్రతినిధి కాడు. ప్రజాజీవితంతో ముడిపడి ఉన్న నాయకుడు ప్రశాంత్‌ రెడ్డి అని కేటీఆర్‌ కొనియాడారు.కేసీఆర్‌ నాయకత్వంలో పట్టణాలు, పల్లెలను అభివృద్ధి చెందాయని కేటీఆర్‌ తెలిపారు. భారతదేశానికి పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ చేరింది. అత్యుత్తమ గ్రామపంచాయతీలు, అత్యుత్తమ మున్సిపాలిటీలు మన దగ్గరే ఉన్నాయని కేంద్రం చెప్పింది. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 24 వేలు.. 2023 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 17 వేలకు చేరింది. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలోని కొంగరకలాన్‌లో 200 ఎకరాల్లో ఫాక్స్‌ కాన్‌ వారు కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారు. మే నెలలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. ఈ పరిశ్రమ వల్ల లక్ష మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అని కేటీఆర్‌ తెలిపారు.రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయి.. ప్రజల సంపద, రాష్ట్ర సంపద పెరిగింది కాబట్టే పేదలకు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. రైతు బంధు అమలు చేస్తున్నాం. పంటలు వేసే కాలంలో ఎకరాకు రూ. 5 వేల చొప్పున సాయం అందజేస్తున్నాం. రైతుబంధు కింద రూ. 65 వేల కోట్లు ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబీమా కల్పిస్తున్నాం. పుట్టిన బిడ్డకు ఆరోగ్యలక్ష్మి, పెళ్లి చేసుకునేవారికి కల్యాణలక్ష్మి అమలు చేస్తున్నాం? గృహలక్ష్మి పథకం కింద మహిళల పేరు విూద రూ. 3 లక్షల చొప్పున అందించబోతున్నాం. ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. అందర్నీ కడుపులో పెట్టుకుని చూస్తున్నాం. మంచినీరు, రహదారులు, కరెంట్‌ సమస్య పరిష్కరిమైంది అని కేటీఆర్‌ తెలిపారు.

 

(ఎల్‌బీ నగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారిపేరు
ప్రకటించిన కేటీఆర్‌
` ఎల్బీనగర్‌ చౌరస్తాలో రెండో ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారిపేరును ఎల్‌బీ నగర్‌ చౌరస్తా కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.  అలాగే ఎల్బీనగర్‌ వద్ద  ప్రారంభించుకున్న ఫ్లై  ఓవర్‌కు మాల్‌ మైసమ్మ అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. ఎల్‌బీ నగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ. 650 కోట్లతో చేపట్టామని కేటీఆర్‌ తెలిపారు. ఈ ఫ్లై ఓవర్‌ 9వ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయి..  బైరామల్‌గూడలో సెకండ్‌ లెవల్‌ ఫ్లై ఓవర్‌, రెండు లూప్‌లను సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం. ఈ పనులను పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎల్‌బీ నగర్‌ చౌరస్తా దాటాలంటే గతంలో 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పుడు ఫ్లై ఓవర్‌ ఓవర్లు, అండర్‌ పాస్‌లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ ఇబ్బంది లేదు. ఈ ఫ్లై ఓవర్లు మాత్రమే కాదు.. ప్రజా రవాణా మెరుగుపడల్సిన అవసరం ఉంది. మళ్లీ రాబోయేది కేసీఆర్‌ ప్రభుత్వమే. తప్పకుండా నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మెట్రోను తీసుకువస్తాం. హయత్‌నగర్‌కు కూడా విస్తరిస్తాం. ఎయిర్‌పోర్టు వరకు కూడా మెట్రోను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గడ్డి అన్నారం మార్కెట్‌లో వెయ్యి పడకల టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే సంవత్సరన్నర కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం అని వివరించారు. జీవో నంబర్‌ 118 కింద దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి చొరవతో పరిష్కరించుకున్నాం. ఈ నెలఖారు వరకు పట్టాలు అందించి, ఆ బాధ నుంచి విముక్తి చేస్తాం. మిగిలిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.