*దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి* 

– మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మునగాల, మే 24(జనంసాక్షి): దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లు అన్నారు. మంగళవారం మునగాల మండలంలోని ఈదులవాగుతండ గ్రామంలో అభయాంజనేయ స్వామి, కోట మైసమ్మ, పోతురాజు దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. గ్రామ దేవతలు గ్రామ సంరక్షకులు అని అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు. అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని, ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఆయన అన్నారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. అనంతరం ఇటీవల కాలంలో ప్రమాదంలో గాయాలు పాలైన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలాజీని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజయ్ కుమార్, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మది బిక్షం , మునగాల టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి కోల ఉపేందర్, వెంకట్ రెడ్డి, ఈదులవాగుతండా సర్పంచ్ బోడా ప్రసాద్, ఎంపిటిసి రవి తదితరులు పాల్గొన్నారు.