దేశంలో దడ పుట్టిస్తోన్నఒమిక్రాన్‌ వేరియంట్‌  

ఒక్కరోజే కొత్తగా 17 కేసులు నమోదు

కొత్తగా 8,306 కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూఢల్లీి,డిసెంబర్‌6  (జనం సాక్షి);  దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో ఇది విస్తరిస్తోంది. రోజురోజుకూ ఈ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.  ఒక్కరోజే కొత్తగా 17 కేసులు నమోదయ్యాయంటే న్యూ వేరియంట్‌ ఎంతలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 2, గుజరాత్‌, ఢల్లీిల్లో ఒక్కో కేసు వెలుగులోకొచ్చింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21కి చేరింది.దేశంలో న్యూ స్టెయ్రిన్‌ విజృంభణతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బూస్టర్‌ డోస్‌కు కసరత్తు చేస్తోంది. విడ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. బూస్టర్‌ డోస్‌తో పాటు చిన్నారుల వ్యాక్సిన్‌పైనా కమిటీ సభ్యులు చర్చించనున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 9మంది, మహారాష్ట్రలో ఏడుగురు కొత్తగా ఈ వేరియంట్‌ బారిన పడ్డారు. దీంతో ఒమిక్రాన్‌ బారిన పడిన వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 21కి చేరింది. ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్‌, ఢల్లీి, ముంబాయిలలో ఒకొక్క కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో పింప్రి చించ్వాడ్‌ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు, ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు సోదరునికి ఈ వేరియంట్‌ సోకినట్లు జినోమ్‌ పరీక్షల్లో తేలింది. వీరు నైజీరియా నుండి ఇటీవలే వచ్చారు. ఫిన్లాండ్‌ నుండి వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ వేరియంట్‌ గుర్తించారు. ఈ నిర్దారణలతో మహారాష్ట్రలో ఈ వేరియంట్‌ సోకిన వారి సంఖ్య 8కి చేరింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఆద్షనగర్‌లో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి ఈ వేరియంట్‌ సోకినట్లు తేలింది. అయితే, వీరందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి స్పల్పంగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,306 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. మరో 211 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో.. 8,834 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,46,41,561కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 3,40,69,608కి చేరింది.. ఇక, కోవిడ్‌తో ప్రాణాలు విడిచినవారి సంఖ్య 4,73,537కు పెరగగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.