నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గూళ్ళ.హరికృష్ణ ముదిరాజ్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్స్ లో నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెనుగు మత్స్య సహాకార సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు గ్రామ,గ్రామల నుంచి పాల్గొని పలు విషయాలపై చర్చ నిర్వహించి మత్స్య సహాకార సంఘాల ఐక్యత కీ మండల సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించి.చెరువు ఆక్రమణలు మరియు మత్స్యకారుల సమస్యల పై అనునిత్యం పోరాటం చేస్తున్న యంగ్ టైగర్ తెనుగోళ్ల ముద్దు బిడ్డ గూళ్ళ.హరికృష్ణ  ఎల్లప్పుడూ మత్స్యకారులకీ అందుబాటులో ఉంటు వారి సేవలను అందిస్తున్న నాయకుడు అని.వేరే కులాల వారు చేపల దోపిడీ విషయంలో చెరువు,కుంటలపై వేరే కులాల వారు దాడులు చేస్తున్న విషయాల పై పోరాటం చేస్తున్న హరికృష్ణ ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం అందరూ కలిసి ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిని ఎన్నిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమాని ఉద్ధేశించి ఏకగ్రీవం ఎన్నికైన మత్స్య సహాకార సంఘాల అధ్యక్షుడు హరికృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ,తెనుగు మత్స్య సహాకార సంఘాల సభ్యులకు అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.18 ఏళ్ల నిండిన వారందరికీ గ్రామ మత్స్య సహాకర సంఘం లో సభ్యత్వాలను స్కిల్ టెస్ట్ ద్వారా కల్పిస్తాం అని తెలిపారు.చెరువు,కుంటలే మా జీవనాధారం నాగర్ కర్నూల్ మండలంలోని గ్రామాల్లో ఉన్న చెరువు ఆక్రమణ చేస్తే వారి పై మా మండల మత్స్య సహాకార సంఘాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పోరాటం చేసాం అని తెలిపారు.నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల కమిటీ అధ్యక్షుడు గా గూళ్ళ.హరికృష్ణ ముదిరాజ్ ఉపాధ్యక్షులు గా ఈర్ల.శోభన్,గూళ్ళ.చెన్నకేశవులు,కొరపాల.శేఖర్,కార్యదర్శి గొడుగు.సహాదేవుడుప్రధాన గా కార్యదర్శి ఎర్రవోలు.మహేష్,ప్రచార కార్యదర్శి గా కొండమోని.భీమ్మయ్య
సలహాదారుడు.అనుపటి.రాములు కార్యవర్గ సభ్యులుగా బచ్చలి.వెంకటస్వామి,చాపల సాయిలు,కనుక.వెంకటయ్య,జాజల.రాములు,చెన్నమనేని.సత్యం ఎన్నిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తవిటి.నిరంజన్,తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి బంగారయ్య,సలేశ్వరం నాగర్ కర్నూల్ మండలాల్లో ఉన్న మత్స్య సహాకార సంఘాల అధ్యక్షులు బచ్ఛలి.వెంకటయ్య,రాములు,కొండమోని.వెంకటయ్య,చిన్నయ్య,వెంకటయ్య,రాము,చెన్నయ్య,యానమోని.తిరుపతయ్య,యాదయ్య,మస్తాన్,నరసింహ,శ్రీను,రాజేష్,అశోక్,కాశీం,సైదులు తదితరులు మత్స్యకారులు పాల్గొన్నారు.అనంతరం ప్రధాన రహదారి అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ తొలి అమరుడు పోలిస్ కానిస్టేబుల్ క్రిష్టయ్య 13వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కమిటీ సభ్యులు హరికృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున మత్స్యకారులు అందరూ పాల్గొన్నారు.