నిరుపేద పోడు రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి
2. సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న కలెక్టర్ గోపి…
 వరంగల్ బ్యూరో : సెప్టెంబర్ 22 (జనం సాక్షి)
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే నిరుపేద కుటుంబాల రైతులకు అండగా ఉంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గురువారం హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన
పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అటవీ సంపద ను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరి మీద ఉండన్నారు. స్థానికులు గా ఉండి ఎవరైతే నిరుపేద కుటుంబాలు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారో వారిని గ్రామ కమిటీ గుర్తించి నిర్దారణ చేయాలన్నారు.
గ్రామస్తుల నిర్ణయం తరువాత నే అధికారులు పోడు రైతుల వివరాలను అప్రూవల్ చేయాలన్నారు.
వ్యవసాయం కాకుండా ఎవరైతే కబ్జా చేసి వుంటారో వారి పైన మాత్రం చర్యలు తీసుకోవాలన్నారు.
మండల పరిషత్ అధ్యక్షులను, ఎంపీటీసీ లను ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం చేసి నిజమైన పోడు రైతులను గుర్తించలన్నారు.
ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సమన్వయము గా పని చేసి అటవీ భూములను పరిరక్షించాలన్నారు.
గతం లో ఏ ప్రభుత్వం అటవీ సంపద ను పెంచేందుకు ఎలాంటి కార్యక్రమలను చేపట్టలేదని. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దూరదృష్టి తో
అటవీ విస్తరణ ను పెంచేందుకు హరితహారం కార్యక్రమమను రూపొందించి అటవీ శాతన్ని మన రాష్ట్రం లో గణనీయంగా పెంచారన్నారు.
అట్టి అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకోవలిసిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.
రాష్ట్ర గిరిజనభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అడవులను కాపాడుకుంటూ… పోడు భూముల పైన ఆధారపడి జీవనం సాగించే రైతులకు న్యాయం చేయాలన్నారు.
పోడు వ్యవసాయ భూముల రైతులు నష్ట పోకుండా చూస్తూ అలాగే మున్ముందు ఎవరూ అడవుల జోలికి పోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
నర్సంపేట  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం లో 66 గ్రామపంచాయతీలలో, ఆవాసాలలో
  7470 మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు.
కొంత మంది రైతులు మహబూబాబాద్ జిల్లా , నర్సంపేట కు బార్డర్ లో ఉండటం వల్ల వారు దరఖాస్తు లను మహబూబాబాద్ జిల్లా లో పెట్టుకోవడం జరిగిందన్నారు.
అట్టి అప్లికేషన్ లను కూడా తప్పకుండ పరిగణలోకి తీసుకోవాలన్నారు.
నిజమైన నిరుపేద పోడు భూముల రైతులు పట్టా లు లేక వివిధ ప్రభుత్వ పథకాలలో లబ్ది
 పొందలేక ఆవేదన పొందుతున్నరన్నారు
ఈ సమావేశం లో జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరి సింగ్, ఫారెస్ట్ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.