నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ


కామారెడ్డి ప్రతినిధి పిబ్రవరి3 జనంసాక్షి;
నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ గారి నేతృత్వంలో సెక్రటేరియట్ ను పర్యవేక్షించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్తుండగా వారిని బారీకేడ్లు అడ్డువేసి పోలీసులు నియత్రించారు. ఈ సంద్ఫర్భంగా పోలీసులతో షబ్బీర్ అలీ తొ వాగ్వాదానికి దిగగా అరెస్ట్ చేసి స్థానిక పొలిసు స్టేషన్ కు తరలించారు. అగ్నిప్రమాదంపై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ నేతృత్వంలో టీపీసీసీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. 550 కోట్ల ప్రజాధనం. తో నిర్మించి, ఇప్పుడు వాళ్ళ సొంత సొమ్ము ల .బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఘటనను ‘మాక్ డ్రిల్’ అంటుంది
ఘటన మాక్‌ డ్రిల్‌ అయితే విపక్ష నేతలను పరిశీలించేందుకు అనుమతించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు.
‘కేసీఆర్ తన మూఢ నమ్మకాలను తీర్చేందుకు కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు రెండు మసీదులు, ఆలయాలను కూల్చివేశారని.. ఇప్పుడు ఆ ప్రార్థనా స్థలాలను కూల్చివేసి కేసీఆర్ కు శాపం తగిలింది.
ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపీలు మల్లు రవి, ఎం. అంజన్ కుమార్ యాదవ్‌తో సహా ఇతర కాంగ్రెస్ నేతలను పాల్గొన్నారు