పంటమార్పిడికి రైతుల ఆసక్తి

యాసంగి పంటలకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు
రైతు వేదికలపై సమగ్ర పంటల విధానంపై చర్చ
వ్యవసాయాధికారులతో మంత్రి నిరంజన్‌ రెడ్డి సవిూక్ష
హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): ఈ యాసంగి పంట కోసం సాగుకు సరిపోను విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పంటల మార్పిడి భారీ ఎత్తున జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పప్పు, నూనెగింజల సాగుపై రైతులు అధిక ఆసక్తి కనబరస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం తన నివాసంలో వ్యవసాయం, మార్కెటింగ్‌, ఉద్యాన శాఖల అధికారులతో మంత్రి నిరంజన్‌ రెడ్డి సవిూక్ష చేశారు. మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతుల ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు రైతువేదికలలో పంటల మార్పిడి విూదనే కాకుండా సమగ్ర వ్యవసాయ విధానం విూద చర్చలు, శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ సమాచారం రైతు వేదికలలో అందుబాటులో ఉంచామని ఆయన వివరించారు. రైతులకు అధునాతన సాంకేతికతతతో పాటు వాటి ప్రచారానికి ప్రచార సాధనాలను ఉపయోగించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. .పంటల మార్పిడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయిల్‌ పామ్‌ నర్సరీలలో మొక్కల పెంపకం విూద కూడా నిరంజన్‌ రెడ్డి సవిూక్ష చేశారు. వచ్చే వానాకాలం నాటికి క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్‌ పామ్‌ మొక్కలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సవిూక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీభాయి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండి కేశవులు తదితరులు పాల్గొన్నారు.