పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు నవంబర్ 28(జనం సాక్షి)
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులు ఆమోదం తెలిపారని పటాన్చెరు శాసన సభ్యులు కూడా మహిపాల్ రెడ్డి తెలిపారు. 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సూచనల మేరకు సోమవారం టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ (TSSPDCL) సిఎండి కార్యాలయం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే జిఎంఆర్ కలిసి, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారని పేర్కొన్నారు. అమీన్పూర్ చక్రపురి కాలనీ, పటాన్చెరు జిఎంఆర్ ఫంక్షన్ హాల్, సింఫనీ పార్క్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ గోశాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డి ఈ రమేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.