పాలకల్తీ నిరోధానికి చర్యలు

పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక
ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి అదనపు ధరలు చెల్లిస్తోందని అన్నారు. విజయ డెయిరీతో పాల సేకరణ చేస్తూ పాల ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పాడి రైతులు అభ్యున్నతికి సర్కారు ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2 లక్షలుగా ఉన్న పాడి ఉత్పత్తిని 5 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు. విజయడైరీ ఉత్పత్తులను పల్లెలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. విజయడెయిరీ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ ద్వారా ఉపాధిని కల్పించేందుకు అన్ని మండల కేంద్రాల్లో ఉత్పత్తులను పెంచుతున్నామని, అసక్తిగల యువకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. విజయ డెయిరీ కల్తీ లేకుండా నాణ్యమైన పాలను అందిస్తోందన్నారు. గతంలో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. పాడిపరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు బర్రెల పంపిణీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తోందని అన్నారు. ఇతర రాష్టాల్ర నుంచి దూడలను
కొనుగోలు చేసి ఇక్కడి వాతావరణానికి తట్టుకునే విధంగా పెంచాలనే ఉద్దేశంతో వాటిని పెంచేందుకు ప్రత్యేక షెడ్లను నిర్మిస్తున్నామన్నారు. పాడి పరిశ్రమ ద్వారా రైతులు మంచి లాభాలు పొందే అస్కారముందని, రైతులను పాడి పరిశ్రమవైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని లోక భూమారెడ్డి అన్నారు. పాడి రైతులకు ప్రస్తుతం ధర కంటే అదనంగా రూ. 4 ఇస్తున్నామని, తాను చైర్మన్‌గా ఎన్నికయ్యాక మరో రూ.2 పెంచినట్లు చెప్పారు. షావిూర్‌పేటలో 100 ఎకరాల్లో మెగా డెయిరీ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాట్లు
చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఆదిలాబాద్‌లో పశువుల దూడల పెంపకం కోసం చర్యలు తీ సుకుంటున్నామని అన్నారు. రైతులు పాడి పరిశ్రమ ద్వారా లాభాలు పొందేలా చర్యలు తీసుకుంటునట్లు వెల్లడిరచారు.