పోడు సమస్యల పరిష్కారానికి చర్యలు

జడ్పీ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌ హావిూ
ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి)  : గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. అటవీ భూముల సమస్య పరిష్కారం కోసం మంత్రుల సబ్‌ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లాలోని పోడు భూముల వివరాలను అధికారులు పకడ్బందీగా సేకరించాలని సూచించారు. ధరణి ద్వారా రైతులకు పలు ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 90? పూర్తిచేసిన వైద్య శాఖ అధికారులను మంత్రి అభినందించారు. ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి సురక్షితమైన నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.