ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను తరిమికొట్టండి – రాయల నాగేశ్వరరావు.

కూసుమంచి ఆగస్టు 5 ( జనం సాక్షి) :

ఏఐసీసీ ఆదేశానుసారం పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలకు వ్యతిరేకంగా  శుక్రవారం రోజున పాలేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన మరియు ధర్నా చేశారు. అనంతరం రాయల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ధరలను నియంత్రించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలనుగుండెల్లో పెట్టి చూసుకున్నదని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ పోటీలు పడి నిత్యావసర వస్తువులు మరియు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆర్టీసీ చార్జీలు, ఇది అది అనకుండా అన్నింటిని అధిక ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయని అంతేకాకుండా ప్రజలకు అవసరమయ్యే ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయని ప్రజలు దీనిని గమనించి త్వరలో జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అధికారంలోకి తెస్తే ధరల నియంత్రించడమే కాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి  విధంగా చేస్తామని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని విద్యార్థులకు

 సరైన విద్య, ప్రజలకు మంచి వైద్యం అందించకపోవడం వలన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టుల తోనే నేడు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు నుండి ఈరోజు వరకు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారని కేవలం కాంట్రాక్టర్ కోసమే ప్రాజెక్టులు కట్టారని దళితులకు మూడెకరాల భూమి అటుకెక్కిందని, డబల్ బెడ్ రూములు అడ్రస్ లేకుండా పోయాయని, ఆరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడిగిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించామని నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని దళితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను నేడు ధరణి పేరుతో మళ్లీ లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ధరణి వలన అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత దానిని పూర్తిగా తొలగించి  రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిస్తామని, మిషన్ భగీరథ మిస్సయిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టే గురవయ్య, తిరుమలాయపాలెం కాంగ్రెస్ నాయకులు బెల్లం శ్రీను, నేలకొండపల్లి  మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంకెన వాసు, పోటు లెనిన్, ఎడవల్లి రామ్ రెడ్డి ,తుపాకుల వెంకన్న,, రామారావు, పాలేరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.