ప్రపంచానికి బువ్వపెట్టాలి


` విత్తనాల విషయంలో రాజీలేదు
` నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
` ప్రపంచంలో 800 మిలియన్‌ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు
` 2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు
` 2030 నాటికి జీరో హంగర్‌ లక్ష్యంగా ముందుకు సాగాలి
` వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అనేది అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనది
` అధిక వ్యవసాయ ఉత్పత్తిని సాధించడానికి నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలి.
` కఠినమైన నాణ్యతా నిబంధనలతో కూడిన విత్తన పరిశ్రమ అన్ని దేశాలకు అవసరం
` ఇస్టా కాంగ్రెస్‌ సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కైరో,మే10(జనంసాక్షి):ఆకలితో అలమటిస్తున్న ప్రపంచానికి బువ్వపెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు.ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా కాంగ్రెస్‌ సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్టాపూర్వపు ప్రెసిడెంట్‌ డాక్టర్‌ క్రెగ్‌ ఎంసి గిల్‌, ఇస్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అండ్రూస్‌ వైస్‌, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ, ఇస్టా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేశవులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ రైతుకు నాణ్యమైన విత్తనం అందాలి.ప్రపంచంలో 800 మిలియన్‌ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు.2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు.వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అనేది అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనది.అధిక వ్యవసాయ ఉత్పత్తిని సాధించడానికి నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలి.కఠినమైన నాణ్యతా నిబంధనలతో కూడిన విత్తన పరిశ్రమ అన్ని దేశాలకు అవసరం.2030 నాటికి జీరో హంగర్‌ లక్ష్యంగా ముందుకు సాగాలి.రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు లభించనంత వరకు పరిశోధనలు, రైతుల పంట పెట్టుబడి వృధానే.అంతర్జాతీ య సంస్థ అయిన ఇస్టా విత్తన నమూనా మరియు పరీక్షల కోసం ప్రామాణిక పద్ధతులను అభివృద్ధి చేయాలి.విత్తన పరిశోధనను ప్రోత్సహించడం మరియు విత్తన శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యవసాయం, విత్తన పరిశ్రమలు మరియు విత్తన వ్యాపారానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నాను.తెలంగాణలో నాణ్యత హావిూ వ్యవస్థలను మెరుగుపరచడంలో ఇస్టాతో కలిసి పని చేయడం సంతృప్తినిస్తున్నదిభారత్‌ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. విభిన్న వాతావరణ పరిస్థితులలో విస్తృత శ్రేణి పంటల సాగు జరుగుతున్నది ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 5% అయితే భారతీయ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 12`15%తో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విత్తన పరిశ్రమలలో భారత్‌ ఒకటి. 2014 ` 15 నుండి 2020 ` 21 మధ్యలో తెలంగాణ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 85 శాతం కావడం విశేషం.ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ వ్యవసాయానికి, విత్తన పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు తెలంగాణ వ్యవసాయోత్పత్తి 2014`15లో 20.7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నుండి 38.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. అనేక బహుళజాతి Ê జాతీయ విత్తన కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి. 1/3 శాతం దేశ విత్తన అవసరాలను తెలంగాణ తీరుస్తున్నది. 20కి పైగా దేశాలకు విత్తనాల ఎగుమతి కొనసాగుతున్నది2019లో హైదరాబాద్‌ లో ఇస్టా కాంగ్రెస్‌ అంతర్జాతీయ సదస్సు తెలంగాణ విత్తనరంగం బలోపేతానికి ఎంతో దోహదం చేసింది. ఈ సదస్సులోనే తొలిసారి ఆసియా నుండి డాక్టర్‌ కేశవులు ఇస్టా వైస్‌ ప్రెసిండెంట్‌ గా ఎన్నికయ్యారు. ఇది మానవ వనరులు, సామర్థ్యం పెంపుదల, ప్రయోగశాలల సామర్థ్యం, నాణ్యతా హావిూ వ్యవస్థలు, ప్రపంచ గుర్తింపుకు సహాయపడిరదిఈజిప్ట్‌తో సహా వివిధ దేశాలకు అంతర్జాతీయ (ూఇఅఆ) విత్తన ధృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులను ప్రోత్సహించడం, ఇస్టా గుర్తింపుతో ప్రపంచ స్థాయి విత్తన పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు వంటి అనేక కొత్త కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈజిప్షియన్‌ వ్యవసాయ విధానం భారతదేశంతో సారూప్యత కలిగి ఉన్నది. భారత్‌ మాదిరిగానే ఈజిప్టు ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన భాగం, దేశ స్థూల దేశీయోత్పత్తిలో 12 శాతం ఉండగా. 55 శాతం జనాభాకు ఉపాధిని కూడా కలిగి ఉన్నదిఈజిప్టుతో ఓఈసీడీ విత్తన ఎగుమతులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్‌ లో మా సహకారం కొనసాగిస్తాం’’అని అన్నారు.