ప్రభుత్వ దవాఖాన లో కిందిస్థాయి ఉద్యోగుల దౌర్జన్యం

పట్టించుకోని అధికార యంత్రాంగం
ములుగు బ్యూరో జూలై 30 (జనం సాక్షి):-
ప్రభుత్వ దవాఖాన కు వస్తున్నా రోగులను కింది స్థాయి ఉద్యోగులు చాలా వరకు వేదిఇస్తున్నారు రోగుల పట్ల మరియు వారి వెంట వచ్చిన వ్యక్తుల పట్ల కర్కశ నీయంగా మాట్లాడుతున్నారు  ఇటీవలే జనం సాక్షి పేపర్లో కథనాలు వచ్చినా మారని తీరు ఈ రోజున సదరు వ్యక్తి తన సహోదరుడు క్రిమిసంహారక మందు తాగడంతో ఎమర్జెన్సీగా ఆస్పటల్ తీసుకెళ్లగా ఆ పేషెంట్ ను తీసుకొచ్చిన వ్యక్తులు హాస్పటల్ లో గేట్ దగ్గర్లో ఉన్నటువంటి పార్కింగ్ షెడ్ లో బైక్ పార్కింగ్ చేయగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ దురుసుగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. పార్కింగ్ చేసిన బైక్ను సెక్యూరిటీ దగ్గర ఉన్నటువంటి మేకు తో బైక్ పంచర్ చేయడం జరిగింది ఇదేంటని అతడిని ప్రశ్నించగా ఇక్కడ పెట్టకూడదని ఇక్కడ పెడితే ఇలానే చేస్తున్నామని ఇద్దరు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు సదరు పేషెంట్ వ్యక్తులు అక్కడికి వచ్చే రోగులు సైతం బైకులు పార్కు చేసుకుంటే ఇలా మేకులతో గుచ్చడం మరియు అంతకు ముందర బైకులకు పార్కింగ్ ఫీజు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని అలాగే పంచర్ చేయడం వల్ల రోగులతో వచ్చిన వ్యక్తులు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు యంత్రాంగం ఇకనైనా కదిలి ఇలాంటి వాటికి పాల్పడుతున్న వ్యక్తుల పై చర్య తీసుకోవాలని పేషెంట్ ల తో వచ్చిన వారు అంటున్నారు  పేపర్ లో కథనం వచ్చిన అధికారులు స్పందించడం లేదని జనం వాపోతున్నారు.