ప్రవీణ్‌ కుమార్‌ ప్రయత్నం ఫలించేనా ?

బహుజనుల్లో రాజ్యకాంక్ష రగిలించగలరా !!
దశాబ్దాలుగా దళితులకు తాయిలాలు తప్ప అధికారంలో వాటా దక్కడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారికి పథకాల పేరుతో అధికారంలో ఉన్న పెత్తందారీలు లొంగదీసుకోవడం తప్ప వారిని అధికారానికి చేరువ చేయడం లేదు. ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు తోడు…డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వారు ఎదగలేక పోతున్నారు. ఒకరిద్దరు పైకి వచ్చినా వారిని ఏదో ఒక తాయిలంతో బుట్టలో వేసుకుంటున్నారు. ఆ ఒకరిద్దరిని చూపి ఆయా వర్గాలకు ఘనకార్యం చేశామని చెప్పుకుంటున్నారు. నిజాని కి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడం లేదు. అలా అనేక న్నా వారిని ఎదగనీయడం లేదు. విద్యా,వైద్య పరంగా వారికి అవకాశాలు దక్కడం లేదు. అధికారం అంతా అగ్రవర్ణాల ,ఏతుల్లో ఉండడం, వారే ధనవంతులు కావడంతో పాటు ఆర్థిక, అంగబలంతో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటున్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో కాన్షిరామ్‌ పోరాటం ఓ మలుపు తిప్పింది. బహుజనులకు అధికారం దక్కాలన్న పోరాటంలో కొంత ప్రయత్నం జరిగింది. అలాగే ఒక మౌలిక మార్పు తెచ్చింది. ఫూలే` అంబేద్కర్‌ నిజమైన వారసునిగా ఆయన ఈ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చి వేసాడు. నిజానికి ఆయన ఉండివుంటే… లేదా ఆయన ఆశయాలు కొనసాగివుంటే ఈ పాటికి భారత రాజకీయ చరిత్ర గతి మారేది. అంబేద్కర్‌ వాదానికి మళ్ళీ జీవంపోసి బహుజనులు ఏ నాటికైనా ఈ దేశ పాలకులు కాగలరనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాన్షీరామ్‌ అందించాడు. దక్షిణ భారతదేశంలో కాన్షిరామ్‌ 1990 దశకంలోనే ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో బిఎస్‌పి శాఖలు ప్రారంభించి నప్పటికి ఈనాటికీ సరైన ఫలితాలు రాకపోవడానికి కారణాలు అనేకం. అందుకు బహుజనులు కూడా బలంగా ఈ మార్గంలోకి రాకపోవడమే. తామంతా తమకు అనువైన మార్గాన్ని అనుసరించకపోవడమే. అగ్రవర్ణ పెత్తందారీలు ఈ వర్గాలను అణగదొక్కడం, బెదిరించడం, ఆర్థికంగా లోబర్చుకోవడం వంటి కారణాల వల్ల వీరు అధికార పీఠానికి దూరంగానే ఉంటున్నారు. దీనికితోడు తమవర్గాలకే ఏర్పాటైన పార్టీని లేదా వ్యక్తులను బడుగు వర్గాలు పూర్తిగా విశ్వసించకపోవడం కూడా కారణంగా చూడాలి. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు తీసుకుంటే బలహానవర్గాలకు చోటు దక్కుతుందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రధాని మోడీ బిసి వర్గాలకు చెందిన వాడే అయినా ..ఆయన కార్పోరేట్‌ గుప్పిట్లో పాలన సాగిస్తున్నారు. ఇకపోతే తెలంగాణలో దళితముఖ్యమంత్రి పదవిని ఎరవేసిన కెసిఆర్‌ ఆ వర్గాలను ఆకట్టుకుని లబ్దిపందారే తప్ప ఆ వర్గాలకు మేలు చేకూర్చలేదు. ఉభయతెలుగు రాష్టాల్ల్రో కూడా అలాంటి అవకాశాలు దక్కడం లేదు. ఈ రెండుచోట్లా డబ్బున్న అగ్రవరణ పెత్తందారీ దొరలదే రాజ్యంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓట్లు పొందే ఎత్తుగడలు తెలిసిన వర్గాలు మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. ఇకపోతే తెలంగాణలో ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బిఎస్‌పిలో చేరడం ద్వారా రాజకీయంగా ఓ ప్రయత్నం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మళ్ళీ బహుజన రాజకీయాలపై విస్తృత చర్చ సాగుతోంది. బహుజన రాజకీయాలను కొనసాగించాలనే సదాశయంతో ఐపిఎస్‌ అధికారిగా పదవీ విరమన చేసిన ప్రవీణ్‌ కుమార్‌ నిర్ణయం అహ్వానించదగ్గదే కాకుండా మరోమారు ఈ వర్గాల్లో ఆశలు కలిగించారు. కాన్షిరామ్‌ ఉత్తర భారతంలో బిఎస్‌పి సాధించిన విజయాలను చూపుతూ దక్షిణాది రాష్టాల్ల్రో పార్టీని విస్తరించాలనుకున్నందున, పార్టీకి కావల్సిన నాయకులను అందించే క్రమంలో బలమైన నేతలను ఎంచుకోలేక పోయారు. నిజానికి ప్రతి రాష్ట్రంలో అంతోఇంతో బలమైన ప్రజా పునాది ఉన్న బహుజన
నేతను ఎంచుకుని ఉంటే ఈ పాటికి పార్టీ విస్తరణ జరిగేది. తరవాతి కాలంలో మాయావతి కూడా కేవలం ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యారు. వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నవారితో పార్టీని నిర్మించే ప్రయత్నం చేసినా ఫలితాలను ఇవ్వలేదు. అయిన ప్పటికి తెలుగు రాష్టాల్లో 1989 నుండి ఇప్పటి వరకు ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులు పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాన్షిరామ్‌ ఉత్తర భారతంలో దళితులు, చమార్ల కేంద్రంగా బహుజన కులాలను సవిూకరిం చాడు. బహుజన వాదంతో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సమూహాల నుండి ఎంతోమందిని ప్రజా ప్రతినిధులు గా తీర్చిదిద్దాడు. తెలుగురాష్టాల్ల్రో బిఎస్‌పికి కనీసం ఏదో ఒక కులం పునాది బలం పడాల్సి ఉన్నా అలా జరగలేదు. కారణాలేవైనా ఇక్కడ మరోమారు ఇప్పుడు ఓ సమర్థుడైన అధికారి రాజకీయంగా ముందుకు రావాలని యత్నించడం ఆహ్వానించదగ్గ పరిణా మంగా చూడాలి. ఇకనైనా కొత్త నాయకత్వంతో వస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ అన్ని కులాలను కలుపుకొనిపోయి గట్టి నిర్మాణం చేస్తే అసాధ్యమేవిూ కాదు. బహుజన కులాల్లో అనేక సంఘాలు ఉన్నాయి. వారందరినీ సంఘటిత పరచాలి. పెత్తందారీ రాజకీయనేతలు వారిని కులాలుగా, వర్గాలుగా విడదీసి ఆర్థిక తాయిలాలతో ఎలా ఓటుబ్యాంకు నిర్మించుకుంటున్నారో.. దానితో ఈ వర్గాలు ఎలా బానిసలుగా మారాయో విశదీక రించాలి. కులాల వారిగా చైతన్యం చేస్తూ.. రాజకీయంగా వారికి అవగాహన కల్పిస్తూ..ప్రజాస్వామ్యంలో ఎలా అధికారం దక్కించుకోగలమో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం విశాలమైన బహుజన రాజకీయాలు నిర్మించడం అవసరం. తెలంగాణలో మాల, మాదిగ సంఘాలు వర్గీకరణ వ్యతిరేక, అనుకూల అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. గిరిజనుల్లో కూడా మైదాన, అడవిబిడ్డల మద్య పంచాయితీ ఉంది. ఇలాంటి వన్నీ అధికారంలో ఉన్న అగ్రవర్ణ పెత్తం దారులు తమకు అనుకూలంగా ఉపయోగించు కుంటున్నారు. బ్రిటిషర్లు అవలంబించిన విభజన రాజకీయాల తో వారిలో అనైకత్య సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో బహుజనులు కేవలం ప్రభుత్వ దళిత వ్యతిరేక అంశాల పై ధర్నాలు, రాస్తారోకోలకే పరిమితం అవుతున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా చూపిన తెగువ, పోరాటంతో ముందుకు వెళితే ప్ప దళితుల్లో ఐక్యతను సాధించ లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంది మేధావులు, రచయితలు ప్రభుత్వంతో అంటకాగారు. దీంతో అన్యాయాల విూదా గొంతు విప్పలేక రాజకీయ పబ్బం గడుపుతున్నారు. సంక్షేమ పథకాల ముసుగులో బహుజనులు తమ రాజ్యాధికార కాంక్షను వదులుకోవడంతోనే ఇలా జరుగు తోంది. దీనికి విరుగుడు కనిపెట్టి ముందుకు సాగితే తప్ప ఐక్యత సాధించలేరు. ఈ క్రమంలో ఐపిఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ బిఎస్పీ ద్వారా ఏ మేరకు సంఘటితం చేస్తార న్నది ముఖ్యం. విద్యారంగంలో విలువైన ఫలితాలు సాధించడమే కాక, సృజనాత్మకంగ అలోచించగలిగే వ్యక్తిగా పేరున్న ప్రవీణ్‌ కుమార్‌ ఇందుకు పెద్ద యజ్ఞమేచేయాలి.